Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి.. చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కల్యాణ్
ABN , Publish Date - Apr 24 , 2025 | 09:53 PM
Pahalgam Terror Attack: నెల్లూరులోని కావలికి చెందిన మధుసూదన్ రావు.. విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళిలు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. గురువారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధుసూదన్ రావు ఇంటికి వెళ్లారు.

జమ్మూకాశ్మీర్, పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 26 మంది పర్యాటకులు చనిపోయిన సంగతి తెలిసిందే. వీరిలో 25 మంది భారతీయులు కాగా.. ఒకరు నేపాల్‌కు చెందిన వ్యక్తి. ఇక, 25 మంది భారతీయుల్లో ఇద్దరు తెలుగు వారు కూడా ఉన్నారు. నెల్లూరులోని కావలికి చెందిన మధుసూదన్ రావు.. విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళిలు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. గురువారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధుసూదన్ రావు ఇంటికి వెళ్లారు. మధుసూదన్ రావు కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
చంద్రమౌళి ఇంటికి పవన్
ఉగ్రమూకల దాడిలో చనిపోయిన విశాఖకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి ఇంటికి ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెళ్లారు. చంద్రమౌళి కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. పవన్ ఓదారుస్తున్న సమయంలో ఘటనను తలచుకుని చంద్రమౌళి కుటుంబ సభ్యులు భోరున విలపించారు. వారిని పవన్ ఓదార్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. చంద్రమౌళి మరణంతో కుటుంబసభ్యులతో పాటు బంధువులు, మిత్రులు కూడా శోక సంద్రంలో మునిగిపోయారు. అమాయ ప్రజలపై దాడులకు పాల్పడి, ప్రాణాలు తీస్తున్న ఉగ్రవాదులను వదిపెట్టకూడదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారత్ కీలక నిర్ణయం
ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్‌ను అన్ని విధాలుగా టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతోంది. సింధు జలాలను పాకిస్తాన్‌కు వెళ్లకుండా అడ్డుకట్ట వేసింది. దీంతో పాక్ గిలగిలలాడుతోంది. మరో వైపు పాకిస్తానీలకు వీసాలను సైతం రద్దు చేసింది. 48 గంటల్లోగా పాకిస్తానీలు ఇండియా విడిచి వెళ్లిపోవాలని విదేశీ వ్యవహారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ వీసాలను కూడా రద్దు చేసింది. వారు 6 రోజుల్లోగా ఇండియా వదలి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. భారతీయులు పాకిస్తాన్ వెళ్లొద్దని, పాకిస్తాన్‌లో ఉన్న వాళ్లు వెంటనే వెనక్కు రావాలని అంది.
ఇవి కూడా చదవండి
Waqf Bill Supreme Court hearing: వక్ఫ్ బిల్లు చట్టభద్ధతపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ
Inflation: సాధారణ ప్రజలకు గుడ్ న్యూస్.. 67 నెలల కనిష్ట స్థాయికి ద్రవ్యోల్బణం