వైసీపీ పాలనలో లిఫ్టులపై నిర్లక్ష్యం: నిమ్మల
ABN , Publish Date - Jul 04 , 2025 | 03:39 AM
గతంలో టీడీపీ పాలనలో 1,040 లిఫ్టుల ద్వారా సాగు నీరందిస్తే, వైసీపీ పాలనలో నిర్వహణ లేకపోవడం వల్ల 450 లిఫ్టులు మూలన పడ్డాయని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.

పోలవరం/రాజమహేంద్రవరం, జూలై 3(ఆంధ్రజ్యోతి): గతంలో టీడీపీ పాలనలో 1,040 లిఫ్టుల ద్వారా సాగు నీరందిస్తే, వైసీపీ పాలనలో నిర్వహణ లేకపోవడం వల్ల 450 లిఫ్టులు మూలన పడ్డాయని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. వైసీపీ నిర్లక్ష్యంతో 4 లక్షల ఎకరాల ఆయకట్టును సాగు చేయకుండా వదిలేయాల్సి వచ్చిందన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి ఆయన గురువారం పూజలు నిర్వహించి మోటార్ స్విచ్ ఆన్ చేశారు. అనంతరం తాడిపూడి ఎత్తిపోతల జలాలను విడుదల చేశారు. ఇటుకలకోట సమీపంలో పట్టిసీమ పథకం వద్ద విడుదలవుతున్న జలాలకు పూజలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఐదేళ్లకుపైగా మూలనపడి ఉన్న పురుషోత్తపట్నం పథకం నుంచి పుష్కర కాలువకు నీటిని విడుదల చేశారు.