BREAKING: వైసీపీ మాజీ మంత్రికి పోలీసులు నోటీసులు
ABN , Publish Date - Jul 30 , 2025 | 07:03 AM
Anil Kumar: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు మరోసారి షాక్ ఇచ్చారు పోలీసులు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఆయనకు మరోసారి నోటీసులు అందించారు. మరి ఈసారైనా ఆయన విచారణకు హాజరవుతారా? లేదా ? చూడాలి.

నెల్లూరు, జులై 30: వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు మరోసారి నోటీసులు అందాయి. ఆయనకు రెండోసారి నోటీసులు అందించారు కోవూరు పోలీసులు. వచ్చే నెల 4వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న అనుచిత వ్యాఖ్యలు కేసులో అనిల్ కుమార్ యాదవ్ ఏ2గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో విచారణకు రావాలని పోలీసులు గతంలో నోటీసులు అందించారు.
అరెస్ట్ భయంతో...
గత నోటీసులకు స్పందించని అనిల్ కుమార్ యాదవ్.. అరెస్ట్ భయంతో విచారణకు డుమ్మా కొట్టారు. అదే సమయంలో మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు బిజీగా ఉండడంతో తాజాగా ఈ కేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు.. అనిల్ కుమార్ యాదవ్ కు మరోసారి నోటీసులు అందించారు. కాగా.. తనను అరెస్ట్ చేస్తారనే సమాచారంతో అలర్ట్ అయిన అనిల్.. ఈ కేసుతో తనకు సంబంధం లేదని హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు. హైకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరి ఈ కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ అవుతారా? లేదా? అనేది వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి
ఆసియా కప్ 2025లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌పై ఏసీసీ క్లారిటీ..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి