BREAKING: వైఎస్ జగన్‌కు బిగ్ రిలీఫ్.. షర్మిలకు షాక్!
ABN , Publish Date - Jul 29 , 2025 | 11:14 AM
Jagan: NCLTలో జగన్‌కు ఊరట లభించింది. తమ వాటాలను తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల బదిలీ చేసుకున్నారని జగన్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. విజయలక్ష్మి, షర్మిలకు బదిలీ అయిన వాటాలను నిలుపుదల చేస్తూ తీర్పు ఇచ్చింది. NCLT తీర్పును విజయలక్ష్మి, షర్మిల హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది.

హైదరాబాద్, జులై 29: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు (Jagan) NCLTలో భారీ ఊరట లభించింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాటాల బదిలీపై జగన్ వేసిన పిటిషన్‌ను అనుమతించింది. విజయలక్ష్మి, షర్మిలకు వాటాలు బదిలీ నిలుపుదల చేయాలని జగన్ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం.. జగన్ వాదనలతో ఏకీభవించింది.
విజయలక్ష్మి (Vijayamma), షర్మిలకు (YS Sharmila) బదిలీ అయిన వాటాలను నిలుపుదల చేస్తూ తీర్పు వెలువరించింది. NCLT తీర్పును విజయమ్మ, షర్మిల హైకోర్టు లో సవాల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా గతంలో తన అన్న వదిన కలిసి తమకు సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్‌లో రావాల్సిన వాటాలను ఇవ్వడం లేదని షర్మిల, విజయలక్ష్మి NCLT లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు
ప్రధాని మోదీని బీసీ కాదనడం సిగ్గుచేటు