National Security Advisor Ajit Doval: శ్రీవారిని దర్శించుకున్న అజిత్ దోవల్
ABN , Publish Date - Jun 23 , 2025 | 03:06 AM
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతి(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమల, జూన్22(ఆంధ్రజ్యోతి): జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతి(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున ఆలయంలో జరిగిన సుప్రభాత సేవలో పాల్గొన్న వీరు.. సుప్రభాత పఠనం అనంతరం గర్భాలయంలో స్వామిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపానికి చేరుకోగా వేదపండితులు ఆశీర్వచనం చేసి లడ్డూప్రసాదాలు అందజేశారు.
డీఆర్డీవోకు మంచి జరగాలని స్వామిని ప్రార్థించా: సమీర్ వీ కామత్
వీఐపీ బ్రేక్ సమయంలో డీఆర్డీవో చైర్మన్ సమీర్ వీ కామత్ శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించి లడ్డూప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం సమీర్ వీ కామత్ మీడియాతో మాట్లాడుతూ.. డీఆర్డీవోకు మంచి జరగాలని స్వామిని ప్రార్థించినట్టు తెలిపారు.