రూట్స్ సేవలు ఆదర్శనీయం: మంత్రి సవిత
ABN , Publish Date - Jul 07 , 2025 | 04:09 AM
పన్నెండేళ్లుగా పేదలకు, కేన్సర్ రోగులకు సేవలందిస్తున్న రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఎంతోమందికి ఆదర్శనీయమని మంత్రి సవిత అన్నారు.

విజయవాడ, జూలై 6 (ఆంధ్రజ్యోతి): పన్నెండేళ్లుగా పేదలకు, కేన్సర్ రోగులకు సేవలందిస్తున్న రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఎంతోమందికి ఆదర్శనీయమని మంత్రి సవిత అన్నారు. వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రూట్స్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని పీబీ సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో ఆదివారం ‘రూట్స్ హెల్త్ సర్వీస్-2025’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్ర, తెలంగాణకు చెందిన ఏడుగురు డాక్టర్లకు రూట్స్ హెల్త్ ఫౌండేషన్ అవార్డులు అందించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సవిత మాట్లాడుతూ అత్యుత్తమ సేవలందించిన డాక్టర్లను పన్నెండేళ్లుగా సన్మానించడం గొప్ప విషయమన్నారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఏపీఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏ.విద్యాసాగర్ తదితరులు ప్రసంగించారు. అనంతరం కేన్సర్‌తో బాధపడుతున్న పన్నెండేళ్ల భక్తసింగ్ అనే బాలుడికి రూట్స్ హెల్త్ ఫౌండేషన్ రూ.10 వేల ఆర్థిక సాయం అందించింది. కార్యక్రమంలో సినీనటుడు సుమన్, రూట్స్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పోలవరపు విజయభాస్కర్, డాక్టర్లు రమణమూర్తి, సమరం, మురళీకృష తదితరులు పాల్గొన్నారు.