నగరాలను బీసీ-డీలో చేర్చేందుకు కృషి: మంత్రి సవిత
ABN , Publish Date - Jul 07 , 2025 | 02:31 AM
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నగర(నగరాలు) సామాజిక వర్గీయులను బీసీ-డీలుగా గుర్తించి కులధ్రువీకరణ పత్రాలు జారీచేసేలా చర్యలు తీసుకుంటామని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత హామీ ఇచ్చారు.

అమరావతి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నగర(నగరాలు) సామాజిక వర్గీయులను బీసీ-డీలుగా గుర్తించి కులధ్రువీకరణ పత్రాలు జారీచేసేలా చర్యలు తీసుకుంటామని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత హామీ ఇచ్చారు. టీడీపీ బీసీ నగరాల సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ మరుపిళ్ల తిరుమలేష్ ఆదివారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మంత్రి సవితను నగరాల సామాజిక వర్గీయులతో కలిసి వినతిపత్రం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా నగరాలకు బీసీ-డీ కులధ్రువీకరణ పత్రాలు అందజేయాలని జీఓ ఉన్నా.. అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కేవలం విజయనగరం, శ్రీకాకుళం, విశాఖతో పాటు కృష్ణా జిల్లాల్లో మాత్రమే నగరాలకు బీసీ-డీ కులధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్నారన్నారు. దీనిపై మంత్రి సవిత మాట్లాడుతూ కులధ్రువీకరణ పత్రాల జారీపై అధికారులతో మాట్లాడతానన్నారు.