జస్టిస్ రమేష్ కుమార్తె వివాహానికి హాజరైన మంత్రి లోకేశ్
ABN , Publish Date - Feb 16 , 2025 | 04:03 AM
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ కుమార్తె వివాహానికి రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హాజరై

భోగాపురం, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ కుమార్తె వివాహానికి రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం అమటాంరాయవలస సమీపంలోని రిసార్ట్సులో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం విశాఖకు వెనుతిరిగారు. లోకేశ్ వెంట శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, విశాఖ ఎంపీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఈ వివాహ కార్యక్రమానికి విజయనగరం జిల్లా కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల న్యాయాధికారులు హాజరయ్యారు.