Share News

Minister Lokesh : 9 నెలల్లో అధికారం.. 9 నెలల్లో సంక్షేమం ఇది టీడీపీకే సాధ్యం

ABN , Publish Date - Mar 05 , 2025 | 06:21 AM

అధికారం చేపట్టిన 9 నెలల్లో సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించడమైనా టీడీపీకే సాధ్యమని చెప్పారు. ‘9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్‌ది అయితే, 9 నెలల్లో సంక్షేమాన్ని చేసి చూపించిన ఘనత చంద్రబాబుది.

Minister Lokesh : 9 నెలల్లో అధికారం.. 9 నెలల్లో సంక్షేమం ఇది టీడీపీకే సాధ్యం

పులివెందుల ఎమ్మెల్యే ఇంకా కోలుకోలేదు: లోకేశ్‌

ఈవీఎం అయినా, బ్యాలెట్‌ అయినా గెలుపు కూటమిదేనని మంత్రి లోకేశ్‌ అన్నారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లో అధికారంలోకి రావడమైనా.. అధికారం చేపట్టిన 9 నెలల్లో సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించడమైనా టీడీపీకే సాధ్యమని చెప్పారు. ‘9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్‌ది అయితే, 9 నెలల్లో సంక్షేమాన్ని చేసి చూపించిన ఘనత చంద్రబాబుది. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగే సమయంలో ఆయన ఒకే మాట అన్నారు.. వట్టి గెలుపు కాదు.. భారీ మెజారిటీతో గెలుపు కావాలని చెప్పారు. ఆ ప్రకారం ఓటర్లు మాకు భారీమెజారిటీ కట్టబెట్టారు. ప్రస్తుతం కౌన్సిల్‌లో సంఖ్యాబలం తక్కువ ఉన్నా మన ఎమ్మెల్సీలు పులుల్లా పనిచేస్తున్నారు. వారికి మరో ఇద్దరు తోడవడం ఆనందంగా ఉంది. ఈ నెలలోనే నామినేటెడ్‌ పదవులన్నీ భర్తీ చేస్తున్నాం’ అని ప్రకటించారు. ప్రజలు కొట్టిన దెబ్బకు పులివెందుల ఎమ్మెల్యే ఇంకా కోలుకోలేదన్నారు. ఒక రోజు ఎమ్మెల్యేగా జగన్‌ ముద్ర వేసుకున్నారని.. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం ఒక రోజు అసెంబ్లీకి వచ్చి.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడిగి బెంగళూరు వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు.

వైసీపీకి చెంపపెట్టు: మంత్రి సత్యకుమార్‌

2024 ఫలితాలకంటే ఘన విజయాన్ని అందించి కూటమి ప్రభుత్వంపై ఓటర్లు రెట్టింపు నమ్మకాన్ని చూపారని బీజేపీ సీనియర్‌ నేత, మంత్రి సత్యకుమార్‌ అన్నారు. ఈ ఫలితాలు వైసీపీకి చెంపపెట్టన్నారు.

కష్టకాలంలో కలిసి ఉంటామని..: నాదెండ్ల

జనసేనకు చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వంపై నమ్మకంతో వారి భవిష్యత్‌ కోసం పట్టభద్రులైన యువత కూటమికి ఓట్లు వేశారని పేర్కొన్నారు. చిన్న చిన్న మనస్పర్థలు సహజమైనా కష్టకాలంలో కలిసి ఉంటామని ఈ ఎన్నికలు నిరూపించాయన్నారు.

Updated Date - Mar 05 , 2025 | 06:21 AM