Share News

Minister Atchan Naidu: రైతులకు జగన్‌ చేసిన మేలేమీ లేదు

ABN , Publish Date - Nov 26 , 2025 | 06:05 AM

రాష్ట్రంలో తన ఐదేళ్ల పాలనలో జగన్‌ రైతులకు చేసిన మేలేమీ లేదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

Minister Atchan Naidu: రైతులకు జగన్‌ చేసిన మేలేమీ లేదు

  • 900 కోట్లు ఇచ్చి.. 8 వేల కోట్లు అని అబద్ధాలు: మంత్రి అచ్చెన్న

సత్తెనపల్లి, అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తన ఐదేళ్ల పాలనలో జగన్‌ రైతులకు చేసిన మేలేమీ లేదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. వైసీపీ పాలనలో రైతులకు మేలు చేయక పోగా రూ.8000 కోట్లు సాయం అందించామని జగన్‌ పచ్చి అబద్దాలు చెబుతున్నాడని కేవలం 900 కోట్లను మాత్రమే అందించారన్నారు. 16 నెలల కూటమి పాలనలోనే రైతులకు రూ.300 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. కాగా, రైతులకు ఉచితంగా టార్పాలిన్‌ పట్టాలు సరఫరా చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

Updated Date - Nov 26 , 2025 | 06:05 AM