Share News

SIT Investigation: లిక్కర్‌ స్కామ్‌లో 32.85 కోట్లు జప్తు

ABN , Publish Date - Jul 12 , 2025 | 03:49 AM

జగన్‌ ప్రభుత్వంలో జరిగిన మూడున్నర వేల కోట్ల మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులు దోచుకున్న 32.85 కోట్ల రూపాయల సొమ్మును ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్‌) జప్తు చేసింది.

SIT Investigation: లిక్కర్‌ స్కామ్‌లో 32.85 కోట్లు జప్తు

  • లిక్కర్‌ స్కామ్‌లో 32.85 కోట్లు జప్తు

  • లిక్కర్‌ స్కామ్‌లో 32.85 కోట్లు జప్తు

  • సిట్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి

  • కసిరెడ్డి గుప్పిట్లో ఉండే ఆదాన్‌ ఖాతాలోనే 30 కోట్లు

  • ఇప్పటిదాకా జప్తుచేసిన మొత్తం 62.85 కోట్లు

అమరావతి/విజయవాడ, జూలై 11(ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభుత్వంలో జరిగిన మూడున్నర వేల కోట్ల మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులు దోచుకున్న 32.85 కోట్ల రూపాయల సొమ్మును ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్‌) జప్తు చేసింది. ఇందుకు శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ స్కామ్‌లో కీలక సూత్రధారి రాజ్‌ కసిరెడ్డి(ఏ-1) గుప్పిట్లో ఉండే ఆదాన్‌ డిస్టిలరీ్‌సకు చెందిన 30 కోట్ల రూపాయలను హైదరాబాద్‌లో మాదాపూర్‌లోని ఒక బ్యాంకులో రెండు ఖాతాల్లో దాచారు. ఈ సొమ్ము మద్యం ముడుపులకు సంబంధించినదిగా ఇదివరకే సిట్‌ గుర్తించింది. దీన్ని జప్తు చేయడానికి కోర్టులో పిటిషన్‌ వేసేందుకు కేసు దర్యాప్తు అధికారికి రాష్ట్ర హోంశాఖ అనుమతిచ్చింది. మరోవైపు లీలా డిస్టిలరీస్‌కు చెందిన 2.85 కోట్ల రూపాయల జప్తునకు సిట్‌ అనుమతి పొందింది. తాజాగా కోర్టు అనుమతి ఇవ్వడంతో లైన్‌ క్లియరైంది. సిట్‌ ఇటీవలే లిక్కర్‌ స్కామ్‌లో నాలుగు సంస్థలకు చెందిన 30 కోట్ల రూపాయలను జప్తు చేసింది. దీంతో ఈ కేసులో మొత్తం రూ.62.85 కోట్లు అటాచ్‌ చేసింది. రాజ్‌ కసిరెడ్డి.. ఆదాన్‌, లీలా డిస్టిలరీస్‌ను గుప్పిట్లో పెట్టుకుని, అనామక డైరెక్టర్లను నియమించుకుని రూ.800 కోట్ల ఆర్డర్లు తెప్పించుకున్నట్లు సిట్‌ విచారణలో తేలింది. అందులో నుంచి ముడుపుల సొమ్మును ఫోనిక్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీ బ్యాంకు ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్‌ చేసి తర్వాత తిరిగి పొందినట్లు అధికారులు గుర్తించారు.

Updated Date - Jul 12 , 2025 | 08:30 AM