Share News

Liquor Scam: మద్యం స్కాం నిందితుల బెయిల్‌ పిటిషన్లు వాయిదా

ABN , Publish Date - Jul 04 , 2025 | 03:26 AM

మద్యం కుంభకోణంలో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న నిందితులు దాఖలు చేసిన బెయిల్‌పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. పైలా దిలీప్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగియడంతో...

Liquor Scam: మద్యం స్కాం నిందితుల బెయిల్‌ పిటిషన్లు వాయిదా

విజయవాడ, జూలై 3(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్న నిందితులు దాఖలు చేసిన బెయిల్‌పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. పైలా దిలీప్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగియడంతో తీర్పును శుక్రవారానికి వాయిదా వేస్తూ న్యాయాధికారి పి.భాస్కరరావు ఉత్తర్వులిచ్చారు. సజ్జల శ్రీధర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ వేయాలని ప్రాసిక్యూషన్‌ను ఆదేశిస్తూ విచారణను ఈనెల 8కి వాయి దా వేశారు. బాలాజీ గోవిందప్ప బెయిల్‌ పిటిషన్‌పై ప్రాసిక్యూషన్‌ తరఫున వాదనలను 8కి వాయిదా వేశారు.

Updated Date - Jul 04 , 2025 | 03:28 AM