అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ABN , Publish Date - Jul 27 , 2025 | 12:31 AM
అర్హులందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
మాధవీనగర్‌లో ‘తొలి అడుగు’
కల్లూరు, జూలై 26(ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. శనివారం 21వ వార్డు మాధవీనగర్‌లో సుపరిపాలన తొలిఅడుగు కార్యక్ర మం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాణ్యం నియో జకవర్గం అబ్జర్వర్ ఆదెన్న, రాఘవేంద్ర, కట్ట వెంకట్‌రెడ్డి, దివాకర్‌రెడ్డి, పల్లె రఘునాథ్‌రెడ్డి, భరతనాయక్, లక్ష్మణ్‌స్వామి, వెంకటేష్ చౌదరి, గంగాధ ర్‌గౌడ్, మహేష్‌యాదవ్ పాల్గొన్నారు.