అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ABN , Publish Date - Jul 24 , 2025 | 12:17 AM
కూటమి ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
కల్లూరు, జూలై 23(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. బుధవారం కల్లూరు మండలం కొంగనపాడు, చెట్లమల్లాపురం గ్రామాల్లో నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు టీటీడీ సభ్యుడు మల్లెల రాజశేఖర్‌తో కలిసి ఆమె సుపరిపాలన తొలిఅడుగు కార్యక్ర మంలో పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు టి.వినోద్‌కుమార్, తిమ్మారెడ్డి, శివ, దామోదర్‌రెడ్డి, ఉలింద కొండ సోసైటీ చైర్మన ఈవీ.రమణ, ధనుంజయ, జాఫర్, కురుపాటి దేవేంద్రారెడ్డి, కరీం నాయకులు పాల్గొన్నారు.