Share News

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Aug 03 , 2025 | 12:58 AM

రైతు సంక్షేమ మే ధ్వేయంగా ప్రభుత్వ పాలన సాగు తోందని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. శనివారం చక్కరాళ్ల గ్రామంలో ‘అన్నదాత సుఖీభవ’ రైతులతో సమావేశం నిర్వహించారు

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
పత్తికొండలో రైతులకు డ్రోన్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు

అన్నదాత సుఖీభవ కింద రైతుల ఖాతాల్లో నగదు జమ

నియోజకవర్గాల్లో రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకుల సంబరాలు

పత్తికొండ, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమ మే ధ్వేయంగా ప్రభుత్వ పాలన సాగు తోందని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. శనివారం చక్కరాళ్ల గ్రామంలో ‘అన్నదాత సుఖీభవ’ రైతులతో సమావేశం నిర్వహించారు. రైతు బాగుంటే దేశం బాగుంటుందని అందుకే వారికి అండగా నిలిచామ న్నారు. రైతులకు రెండు విడతల్లో రూ.20లు ఇస్తున్నా మని, మొదటివిడతగా రూ.7వేలు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేసిందన్నారు. నియోజకవర్గ పరిదిలో 54,774 మంది రైతులకు రూ 37.83 కోట్లు జమ చేశామన్నారు. అనంతరం రైతులకు డ్రోన్లను పంపిణీ చేశారు. ఆర్డీవో భరత్‌నాయక్‌, ఏడీఏ మోహన్‌ విజయకుమార్‌, ఏవో వెంకటరాముడు, ఆర్‌ఐ స్వామి, టీడీపీ నాయకులు సాంబశివారెడ్డి, ఎంపీటీసీ రాజు, సింగిల్‌విండ్‌ అధ్యక్షుడు రంగప్ప, నాయకులు, రామానాయుడు, తిమ్మరాజు, డాన్‌, రాంపల్లి రంగప్ప, బిజేపి నాయకుడు గోవర్థన్‌ ఉన్నారు.

అన్నదాత సుఖీభవతో రైతుకు ఆసరా

ఆలూరు: ‘అన్నదాత సుఖీభవతో’ రైతులు ఆసరా లభించిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామలను సీఎం చంద్రబాబు నెరవేరుస్తున్నారని జిలా సహకార బ్యాంకు కేంద్ర చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, ఆర్టీసీ రీజినల్‌ చైర్మన్‌ పూల నాగరాజు, టీడీపీ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్‌ అన్నారు. శనివారం పట్టణంలోని వ్యవసాయ కార్యాల యం వద్ద ఏడీఏ చెంగలరాయుడు ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. తహసీల్దార్‌ శోభాసువర్ణమ్మ, ఏవో వెంకటేశ్వరగౌడ్‌, ఏబీసీ డీసీ అద్యక్షుడు నగరడోణ కిష్టప్ప, మాజీ జడ్పీటీసీ మీనాక్షినాయుడు, అశోక్‌, సుధాకర్‌ ఉన్నారు.

తుగ్గలి: రాష్ట్రంలో రైతులు అభివృద్ది చెందుతున్నట్లు టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి తుగ్గలి నాగేంద్ర, బత్తిన వెంకట్రాముడు, మనోహర్‌ చౌదరి, తిమ్మయ్య చౌదరి అన్నారు. శనివారం వ్యవసాయ కార్యాల యంలో అన్నదాత సుఖీభవ అమలు చేసినందుకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు క్షీరాభిషేకం అన్నారు. ఏఈవోలు లక్ష్మినారా యణ, బాల సరస్వతి, తిరుపాల్‌ నాయుడు, చంద్రశేఖర్‌ యాదవ్‌, వెంకటస్వామి ఉన్నారు.

ఆలూరు: సీఎం చంద్రబాబు రైతుకు మేలు చేశారని టీడీపీ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్‌, కామినహాల్‌ రమేష్‌ అన్నారు. రైతులకు అమలు చేయడంతో శనివారం సాయంత్రం పట్టణంలో బైకు ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్‌ కూడలి వద్ద ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఏబీసీ అధ్యక్షుడు నగరడోణ కిష్టప్ప, కన్వీనర్‌ అశోక్‌, సర్పంచ్‌ నాగరాజు, రఘుప్రసాద్‌రెడ్డి ఉన్నారు.

హాలహర్వి: మండల కేంద్రంలో భారీ బహిరంగ సభలో ఏర్పాటు చేశారు. సీఎం చరందబాబు చ్రితపటానికి క్షీరాభిషేకం చేశారు. సర్పంచ్‌ మల్లికార్జున, యువనేత రఘుప్రసాద్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు రమేష్‌, తిప్పేస్వామి, కురువ మల్లన్న తదితరులు పాల్గొన్నారు.

ఆస్పరి: మండలంలో 14,503 మంది రైతులకు రూ.9.9 కోట్లతో ఒక్కో రైతుకు రూ.7 వేలు చొపుపన నగదు ఖాతాల్లో జమ అయ్యింది. సొసైటీ మాజీ చైర్మన్‌ నౌనేపాటిచౌదరి, రవిప్రకాష్‌రెడ్డి సీఎం చంద్రబాబు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.ఎంపీటీసీ రహమతుల్లా, మేకల రంగనాథ్‌, యుగంధర్‌, వీరేష్‌ ఉన్నారు.

Updated Date - Aug 03 , 2025 | 12:58 AM