Share News

సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి

ABN , Publish Date - Apr 29 , 2025 | 12:52 AM

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని సీఐటీయూ జిల్లా అధ్య క్షుడు పీఎస్‌.రాధాక్రిష్ణ డిమాండ్‌ చేశారు.

సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి
ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న కార్మిక సంఘం నాయకులు

కర్నూలు న్యూసిటీ, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని సీఐటీయూ జిల్లా అధ్య క్షుడు పీఎస్‌.రాధాక్రిష్ణ డిమాండ్‌ చేశారు. సోమవారం భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును ప్రాంరభించాలని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట సంఘం జిల్లా అధ్యక్షుడు ఖాజాబాషా అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. రాధాక్రిష్ణ మాట్లాడుతూ నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, 50 సంవత్సరాలు నిండిన కార్మికులకు రూ.10వేల పెన్షన ఇవ్వాలని, భవన నిర్మాణ రంగానికి ఉపయోగిం చునే వస్తులపై జీఎస్టీ తగ్గించాలని కోరారు. అనంతరం కలెక్టర్‌ పి.రంజితబాషాకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి సుధా కరప్ప, కార్మిక సంఘం నగర కార్యదర్శి నరసింహులు, నాగరాజు, అబ్దుల్లా, లియాఖత అలీఖాన పాల్గొన్నారు.

Updated Date - Apr 29 , 2025 | 12:52 AM