Share News

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Aug 04 , 2025 | 12:50 AM

రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
గౌరు దంపతులను గజమాలతో సన్మానిస్తున్న ఈవీ రమణ దంపతులు

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

కల్లూరు, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. ఆదివారం ఉలిందకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మనగా ఈవీ. రమణ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిఽథులు గా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, నందికొట్కూరు టీడీపీ ఇనచార్జి గౌరు వెంకటరెడ్డి, నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌, ఏపీ సీడ్స్‌ చైర్మన ధర్మవరం సుబ్బారెడ్డి, గౌరు జనారన్ధనరెడ్డి హాజరై ఉలిం దకొండ పీఏసీఎస్‌ చైర్మనగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు డైరెక్టర్లుగా టి.మురళి, బి.నాగరాజులను ఆ శాఖ సీఈఓ బి.హరిఫ్‌ బాషా ప్రమాణం చేయించారు. గౌరుచరిత మాట్లాడుతూ సహకార సం ఘాల్లో రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందించి వారిని అప్పుల ఊబీలో పడకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు రైతులకు పెట్టుబడి సాయం అందించి భరోసా కల్పిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ అర్హులైన రైతులకు పార దర్శకంగా రుణాలు అందించి మంచిపేరు తెచ్చుకోవాలన్నారు. నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌, ఏపీ సీడ్‌ చైర్మన ధర్మవరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పదవులు వరిస్తాయన్నారు. ఈవీ రమణ మాట్లాడుతూ ఉలిందకొండ ప్రాథమిక సహకార సంఘం పరిధిలో వ్యవసాయ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. సొసైటీలో రైతులకు రుణాలు అందించి సంస్థను అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. కార్యక్ర మంలో పాణ్యం పరిశీలకుడు ఆదెన్న, డి.రామాంజనేయులు, యుద్ధం శ్రీనివాసులు, వాకిటి మాదేష్‌, కె.ధనుంజయ, కాసాని మహేష్‌గౌడ్‌, టి.వినోద్‌, ఈవీ రమణ యువసేన నాయకులు ఈవీ శ్రీకాంత, షేక్షావలి, సి.రమణ, విక్రమ్‌కుమార్‌, మధు, రాజేష్‌, చిన్నమారెన్న, సుబ్బరాయుడు పాల్గొన్నారు.

Updated Date - Aug 04 , 2025 | 12:50 AM