అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Aug 01 , 2025 | 01:07 AM
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత పేర్కొ న్నారు.

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
దొడ్డిపాడులో ‘తొలిఅడుగు’
కల్లూరు, జూలై 31(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత పేర్కొ న్నారు. గురువారం కల్లూరు మండలం దొడ్డిపాడు గ్రామం సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రభుత్వం అమలు చేసిన సం క్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అలాగే నాబర్డ్ నిధులు రూ.1.41 కోట్లతో కర్నూలు- అనుగొండ నుంచి దొడ్డిపాడు వరకు తారురోడ్డు, ఎనఈర్‌ఈజీఎస్ నిధులు రూ.10 లక్షలతో పూర్తి అయిన రెండు అంతర్గత రహదారులను ఎమ్మెల్యే ప్రారంభించారు. గౌరుచరిత మాట్లా డుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నా రన్నారు. కార్యక్రమంలో ఏపీ ఫైనాన్స కార్పొరేషన డైరెక్టర్ డి.రామాంజనే యులు, వాకిటి మాదేష్, కురవ ధనుంజయ, దొడ్డిపాడు బాషా, ఖాసీం, ఇమ్రాన, మునిస్వామి, పుల్లారెడ్డి, రామిరెడ్డి, చిన్నమారెన్న పాల్గొన్నారు.