రైతు సంక్షేమమే ధ్యేయం
ABN , Publish Date - Aug 03 , 2025 | 12:41 AM
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.

కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి
‘అన్నదాత సుఖీభవ’ చెక్కుల పంపిణీ
గూడూరు, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. శనివారం గూడూరులో కోడుమూరు నియోజకవర్గ స్థాయి అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్ర మానికి ఎమ్మెల్యే దస్తగిరి, జాయింట్ కలెక్టర్ బి.నవ్య ముఖ్య అతిఽథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సూపర్‌సిక్స్‌లో భాగంగా ఎన్నికల సమయంలో పేదలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేర్చుతుంద న్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు సంవత్సరానికి రూ.20 వేలు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. జాయింట్ కలెక్టర్ బి.నవ్య మాట్లాడు తూ రైతుల స్థిర ఆర్థిక భద్రత కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై వివరించారు. ఆర్డీవో సందీప్ కుమార్, పట్టణ టీడీపీ అధ్య క్షుడు రామాంజనేయులు, సింగిల్ విండో అధ్యక్షుడు దాన మయ్య, డైరెక్టర్ రేమట వెంకటేష్, టీడీపీ నాయకుడు సృజన, కౌన్సిలర్లు కోడుమూరు షాషావలి, బుడ్డంగలి, టీడీపీ నాయకులు పౌలు, తెలుగు శ్రీను, నాగప్ప యాదవ్, చాంద్‌బాషా, సుమనబాబు, ఏడీఏ సాలురెడ్డి, ఏవోలు దస్తగిరి రెడ్డి, మల్లేష్‌యాదవ్, రవిప్రకాష్, రూఫస్ రోనాల్డ్, శ్రీవర్థన రెడ్డి పాల్గొన్నారు.
రైతు సంక్షేమానికి పెద్దపీట: టీడీపీ
కల్లూరు: రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని టీడీపీ నాయకుడు శేఖర్‌చౌదరి అన్నారు. శనివారం పందిపా డులో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం విడుదల చేసిన చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. శేఖర్ చౌదరి మాట్లాడుతూ చంద్రబా బు రాయలసీమ జిల్లాల్లో సాగు, తాగునీటి పథకాలకు నాంది పలికార న్నారు. కార్యక్రమంలో కల్లూరు తహసీల్దారు కె.ఆంజనేయులు, కూరపాటి దేవేంద్రరెడ్డి, పూలశివశంకర్, పురుషోత్తం రెడ్డి, భీష్ముడు, లక్ష్మన్న యాదవ్, మద్దిలేటి, బోయశివ పాల్గొన్నారు.
ఓర్వకల్లు: రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ మండల కన్వీనర్ గోవిందరెడ్డి అన్నారు. శనివారం ఓర్వకల్లులోని రైతు సేవా కేంద్రంలో అన్నదాత సుఖీభవ పథకం, పీఎం కిసాన నిధులు రైతులకు విడుదల కావడంతో గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. గోవిందరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన ప్రతి రైతుకు మొదటి విడత కింద రూ.7వేలు రైతుల ఖాతాలో జమ చేశార న్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు లక్ష్మీకాంతరెడ్డి, స్వామిరెడ్డి, రామకోటే శ్వరరావు, వెంకట్రామిరెడ్డి, అల్లాబాబు, పార్థసారధిరెడ్డి, వేణు గోపాల్ రెడ్డి, అబ్దుల్లా, శ్రీనివాసులు, శ్రీరాములు, ఆయూబ్ బాషా, స్వా ములు, మహిళలు, రైతులు పాల్గొన్నారు.