విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించాలి: డీఈవో
ABN , Publish Date - Aug 02 , 2025 | 11:39 PM
విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించాలి: డీఈవో

కర్నూలు ఎడ్యుకేషన్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): పాఠశాలలకు మండల విద్యాశాఖ అధికారులు, ఉప విద్యాశాఖ అధికారులు తనిఖీలకు వెళ్లినప్పుడు విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించాలని డీఈవో శామ్యూల్ పాల్ సూచించారు. నగర సమీపంలోని జి.పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం విద్యాశాఖ అధికారులు, హెచ్‌ఎంలు, కేజీబీవీ ప్రిన్సిపాళ్లకు, అకౌంటెంట్లతో డీఈవో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు విడుదలైన నిధులను సక్రమమైన రీతిలో వినియోగించుకుని బిల్లులను సత్వరమే అప్‌లోడు చేయాలన్నారు. ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు వంద శాతం నమోదయ్యేలా విద్యాశాఖ అధికారులు, హెచ్‌ఎంలు బాధ్యత తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయుల తరగతుల పర్యవేక్షణ, విద్యా కార్యకలాపాలు ఎస్‌ఎంసీ సభ్యులతో సంబంధాలు, అభ్యాసన ఫలితాలు, మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగి ఉపాధ్యాయులను ప్రోత్సహించడం, ఉత్తమ పద్ధతులను కనుగొనడం, నెమ్మదిగా నేర్చుకునే వారికి మద్దతు ఇవ్వడం వంటి అంశాలపై ప్రసంగించారు. సమావేశంలో జిల్లా సర్వశిక్ష అభియాన్ సెక్టోరల్ అధికారులు షేక్ రఫీ, ఆల్టర్నేటివ్ స్కూలింగ్ కోఆర్డినేటర్ సురేంద్రబాపూజీ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసులు, అసిస్టెంట్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.