సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం
ABN , Publish Date - Dec 12 , 2025 | 11:49 PM
పోలీసు సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ సునీల్ షెరాన్ పేర్కొన్నారు.
ఎస్పీ సునీల్ షెరాన్
నంద్యాల టౌన్, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): పోలీసు సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ సునీల్ షెరాన్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సిబ్బంది సమస్యల పరిష్కారం దిశగా గ్రీవెన్స్డేను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్లు, పలు విభాగాల సిబ్బంది, హోంగార్డుల సమస్యలను పరిష్కారిస్తామన్నారు. సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు మెరుగైన సేవలు అందించి వారి మన్ననలు పొందే విధంగా విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.