‘పీఎం శ్రీ’ ప్రభుత్వ పాఠశాలలకు వరం
ABN , Publish Date - Jul 30 , 2025 | 12:15 AM
పీఎం శ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్) పథకం ప్రభుత్వ పాఠశాలలకు వరం లాంటిదని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
ఓర్వకల్లు, జూలై 29(ఆంధ్రజ్యోతి): పీఎం శ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్) పథకం ప్రభుత్వ పాఠశాలలకు వరం లాంటిదని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఏపీ మోడల్ స్కూల్ పీఎం శ్రీ పథకం కింద ఎంపికైంది. మంగళవా రం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, డీఈఓ శ్యాముల్‌పాల్ ఆదర్శ పాఠ శాలలో పీఎంశ్రీ పథకం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ముందుగా తరగతి గదులు, ఇంటర్నెట్, విద్యార్థుల ఉత్తీర్ణత రికార్డులను ఎమ్మె ల్యే పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఓర్వకల్లు ఏపీ మోడల్ స్కూల్ బెస్ట్ పాఠశాలగా పీఎం శ్రీ పథకానికి జిల్లాలోనే తొలి పాఠ శాలగా ఎంపికవ్వడం హర్షనీయమన్నారు. తహసీ ల్దార్ విద్యాసాగర్, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎంఈఓలు ఓంకార్ యాదవ్, శ్రీధర్‌బాబు, ఏఎంఓ రఫి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన అయూబ్ బాషా, టీడీపీ మండల కన్వీనర్ గోవిందరెడ్డి, లక్ష్మీకాంతారెడ్డి, ఏసేపు పాల్గొన్నారు.