Share News

నిర్ణీత గడువులోగా అర్జీలు పరిష్కరించాలి

ABN , Publish Date - Dec 12 , 2025 | 11:50 PM

జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుతున్న అర్జీలను నిర్ణీత గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్‌ రాజకుమారి అధికా రులను ఆదేశించారు.

నిర్ణీత గడువులోగా అర్జీలు పరిష్కరించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజకుమారి

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుతున్న అర్జీలను నిర్ణీత గడువులోగా నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్‌ రాజకుమారి అధికా రులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్‌ సెల్‌లో పీజీఆర్‌ఎస్‌ బృంద అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో అర్జీల పరిష్కారంలో ప్రజల సంతృప్తి స్థాయి 82.27 శాతం నమోదైందని, ఈశాతం మరింత పెరిగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అర్జీల పరిష్కారంలో పారదర్శకత, వేగం, నాణ్యతపై పర్యవేక్షణ వుండాలని స్పష్టం చేశారు. పీజీఆర్‌ఎస్‌ టీమ్‌ సభ్యులు గ్రీవెన్సుల స్వీకరణ, పరిష్కార విధానం, ఆడిట్‌ ప్రక్రియల వివరాలను కలెక్టర్‌కు సమర్పించగా ఆమె వాటిని పరిశీలించి తగిన సూచనలిచ్చారు. పీజీఆర్‌ఎస్‌ నోడల్‌ ఆఫీసర్‌ ఉమామహేశ్వరి పాల్గొన్నారు.

Updated Date - Dec 12 , 2025 | 11:50 PM