Share News

టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల.. మాటల యుద్ధం

ABN , Publish Date - Aug 03 , 2025 | 12:56 AM

వైసీపీ హయాంలో ఎమ్మెల్యేలు పందికొక్కులా తిన్నారంటూ 12వ వార్డు కార్పొరేటర్‌ క్రాంతికుమార్‌ ధ్వజమెత్తారు. ఇంతలో వైసీపీ కార్పొరేటర్లు లేచి ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సభామర్యాద కాదని తక్షణమే ఆమాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. శనివారం జరిగిన కర్నూలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం అసెంబ్లీని తలపించింది.

టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల..  మాటల యుద్ధం
సమావేశంలో కార్పొరేటర్ల వాగ్వాదం

రసాభాసగా నగరపాలక సమావేశం

వైసీపీ హయాంలో ఎమ్మెల్యేలు పందికొక్కులా తినేశారు

కార్పొరేటర్‌ క్రాంతికుమార్‌

వైసీపీ కార్పొరేటర్ల ఆందోళన

కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో ఎమ్మెల్యేలు పందికొక్కులా తిన్నారంటూ 12వ వార్డు కార్పొరేటర్‌ క్రాంతికుమార్‌ ధ్వజమెత్తారు. ఇంతలో వైసీపీ కార్పొరేటర్లు లేచి ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సభామర్యాద కాదని తక్షణమే ఆమాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. శనివారం జరిగిన కర్నూలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం అసెంబ్లీని తలపించింది. క్రాంతికుమార్‌ను వైసీపీ కార్పొరేటర్లు చుట్టుముట్టి పొడియం ముందు బైఠాయించారు. అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించారు. గత సమావేశంలో కుర్చీ ఎత్తిపా రేసిన వైసీపీ కార్పొరేటర్‌ యూనుస్‌బాషను ఎందుకు సస్పెండ్‌ చేయలేదని క్రాంతికుమార్‌ ప్రశ్నించారు. మేయర్‌ సభను పది నిమిషాలు వాయిదా వేశారు. ఈక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు అందరూ సమావేశాన్ని బాయ్‌కాట్‌ చేసి బయటికి వెళ్లిపోయారు. అనంతరం సమావేశం ప్రారంభం చేయాలంటే 19మంది సభ్యులు ఉంటే చేయాలి అయితే 17 మంది సభ్యులు ఉండటంతో మేయర్‌ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మేయర్‌ బీవై రామయ్య అధ్యక్షతన సుంకేసుల రోడ్డులోని నూతన కౌన్సిల్‌ హలులో కౌన్సిల్‌ సమేశం జరిగింది. రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యం,ఫుడ్‌ప్రాసెసింగ్‌ శాఖల మంత్రి టీజీ భరత్‌, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, హాజరు అయ్యారు. సమావేశం ప్రారంభం అయిన మధ్యలో టీడీపీ కార్పొరేటర్‌ క్రాంతికుమార్‌ చేసి వాఖ్యలకు వైసీపీ కార్పోరేటర్లు నిలదీయడంతో వాగ్వివాదం మొదలైంది.

ఒకరిపై ఒకరు సెటైర్లు..!

టీడీపీ కార్పొరేటర్‌ క్రాంతికుమార్‌ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క కాంట్రాక్టర్‌కే 108 పనులు అప్పజెప్పడం తో పాటు సీ.బిల్లుల రూపంలో డబ్బులు మంజూరు ఎలా చేస్తారని ప్రశ్నించారు. దీనిపై ఇంజనీరింగ్‌ అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. గత వైసీపీ ఎమ్మెల్యేల సహకారంతోనే సి.బిల్లులు రూ.కోట్లలో దోచుకున్నారని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే వైసీపీ, టీడీపీ కార్పొరేటర్లు ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకున్నారు. వైసీపీ కార్పొరేటర్లు అందరూ పొడియం ముందు బైఠాయించి నిరసన తెలపడంతో టీడీపీ కార్పొరేటర్‌ కలగజేసుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చింది చాలు.. ఇక వచ్చి కుర్చీలో కూర్చొండని అన్నారు. ఇంతలో వైసీపీ కార్పొరేటర్లు మేము ఫొటోలకు ఫోజులు ఇవ్వడానికి రాలేదని సమాదానం ఇచ్చారు. ఇంతలో పరమేష్‌ గత ప్రభుత్వంతో కూడ టీడీపీ కార్పొరేటర్లు సమస్య కోసం పొడియం ముందు వెళితే ఇదే మేయర్‌ ఇక ఫొటోలకు ఫోజులు ఇచ్చింది చాలు వెళ్లి కూర్చోవాలని సమాఽ దానం ఇచ్చినట్లు గుర్తు చేశారు. సమావేశంలో కమిషనర్‌ పి.విశ్వ నాథ్‌, అడిషనల్‌ కమిషనర్‌ ఆర్‌జీవి.కృష్ణ, డిప్యూటి కమిషనర్‌ సతీష్‌ కుమార్‌ రెడ్డి, ఇన్‌చార్జి ఎస్‌ఈ శేషసాయి, ఎంఈ మనోహర్‌రెడ్డి, ప్రజారోగ్య అధికారి డా.కే.విశ్వేశ్వరరెడ్డి, అకౌంట్స్‌ ఆఫీసర్‌ చుండీ ప్రసాద్‌, అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

ఎవరికీ అన్యాయం జరగదు

మెడికల్‌ కళాశాల వద్ద రోడ్డు వైండింగ్‌లో వెళ్తున్న దుకాణ యజ మానులకు అన్యాయం జరగదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వాటిని కూల్చివేసి రోడ్డు వెడల్పు చేస్తాం. నష్టపోయిన యజమా నులకు అశోక్‌నగర్‌ పంప్‌హౌస్‌ వద్ద నూతనంగా నిర్మిం చిన దుకాణాలను కేటాయించాలని కార్పొరేషన్‌ నిర్ణయించింది. దీనిని రాజకీయం చేయవద్దు. పైప్‌లైన్‌ మరమ్మతులతో ఐదు రోజులు మాత్రమే తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగిందని తమ కార్పొరేటర్లు చెప్పారు. 9రోజులు రాలేదని ఎవరూ కూడా చెప్ప లేదు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలి. రతన్‌టాటా విగ్రహన్ని సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ ప్రకారం ఏర్పాటుచేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదు. - టీజీ భరత్‌, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శాఖ

రికార్డులు సరిగాలేవు..

మెడికల్‌ కళాశాల దుకాణాలకు సంబంధించి యజమానులు ఇచ్చిన రికార్డులు సరిగా లేవని రెవెన్యూ అధికారులు తేల్చి చెప్పా రు. అది పూర్తిగా ప్రభుత్వ పోరంబోకు అని నిర్ధారణ అయింది. యజమానులకు నష్టపరిహరం కింద ఎలాంటి స్థలం ఇచ్చేందుకు ఆస్కారంలేదు. ఏదైనా ఉంటేవారికి మున్సిపల్‌ దుకాణాలు కేటా యించేందుకు వీలుంటుంది. పైప్‌లైన్‌ మరమ్మతులకు గురైనప్పుడు అన్నిప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేశాం. - పి.విశ్వనాథ్‌, కమిషనర్‌, నగరపాలక సంస్థ, కర్నూలు

Updated Date - Aug 03 , 2025 | 12:56 AM