జగన జైలుకెళ్లడం తప్పదు
ABN , Publish Date - Jul 25 , 2025 | 12:49 AM
మద్యం కుంభకోణం కేసులో మాజీ సీఎం వైఎస్ జగన త్వరలో జైలుకెళ్లడం తప్పదని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
పాలకొలనులో ‘తొలిఅడుగు’
ఓర్వకల్లు, జూలై 24(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో మాజీ సీఎం వైఎస్ జగన త్వరలో జైలుకెళ్లడం తప్పదని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పాలకొలను, కొమరోలు, చింతలపల్లె గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందిస్తూ ఏడాది కూటమి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలు వివరించారు. గౌరు చరిత మాట్లాడుతూ సిట్టింగ్ ఎంపీ మిథునరెడ్డి కేంద్రంగా జరిగిన భారీ కుంభకోణంలో అసలు సూత్రదా రులు, పాత్రదారులు భాగస్వాములు ఎవరూ కూడా చట్టం నుంచి తప్పించు కోలేరన్నారు. రూ.వేల కోట్ల సొమ్ము అంతిమ లబ్ధిదారు తాడేపల్లె ప్యాలెస్ యజమానే అని ప్రత్యేక దర్యాప్తు బృందం ఆధారాలతో రుజు వు చేయబోతుం దన్నారు. జగనరెడ్డితోపాటు ఎవరైతే ఉన్నారో వారం దరూ జైలు ఊచలు లెక్కించక తప్పదన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలన్నింటీనీ అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో నంద్యాల టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, సర్పంచలు చదువుల సుజాతమ్మ, వెంకటరమణ, టీడీపీ మండల కన్వీనర్ గోవిందరెడ్డి, ఉపాధ్య క్షుడు మోహన రెడ్డి, ఏపీ టూరిజం డైరెక్టర్ ముంతాజ్ భేగం, నాయకులు విశ్వేశ్వరరెడ్డి, చదువుల సుధాకర్ రెడ్డి, బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, చంద్ర పెద్దస్వామి, భాస్కర్ రెడ్డి, మహబూబ్ బాషా, నాగ మల్లేష్, కాకి దేవేంద్ర, రామమద్దిలేటి పాల్గొన్నారు.