ఇద్దరు విద్యార్థినులకు అస్వస్థత
ABN , Publish Date - Aug 03 , 2025 | 12:54 AM
పట్టణ శివారు బనగానపల్లె రహదారిలో ఉన్న కేజీబీవీలో ఇద్దరు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

బేతంచెర్ల, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): పట్టణ శివారు బనగానపల్లె రహదారిలో ఉన్న కేజీబీవీలో ఇద్దరు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కేజీబీవీలో నాలుగు రోజుల క్రితమే ఒక విద్యార్థిని మృతి చెందిన ఘటన మరువకముందే మళ్లీ శనివారం సాయంత్రం అదే పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని విజయలక్ష్మి, 7వ తరగతి విద్యార్థిని నాగభవానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని బేతంచెర్ల ప్రభుత్వాసుపత్రిలో సీపీఐ, విద్యార్థి సంఘాల నాయకులు పరామర్శించారు. ఈ విషయంపై ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులను కర్నూలుకు తరలించినట్లు తెలిపారు. ఎంఈవో సోమశేఖర్‌ను వివరణ కోరగా.. ఈవిషయంపై వివరాలు తెలుసుకుంటానన్నారు.