Share News

తీరు మారకపోతే వేటు తప్పదు

ABN , Publish Date - Dec 03 , 2025 | 12:18 AM

తీరు మార్చుకోకపోతే వేటు తప్పదని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశరెడ్డి సచివాలయ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తీరు మారకపోతే వేటు తప్పదు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశరెడ్డి

సచివాలయ ఉద్యోగులపై ఎమ్మెల్యే కోట్ల ఆగ్రహం

ప్యాపిలి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): తీరు మార్చుకోకపోతే వేటు తప్పదని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశరెడ్డి సచివాలయ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక మండల పరిషత కార్యాలయంలో మండలస్థాయి, సచివాలయ ఉద్యోగులతో ఆయన సమావేశాన్ని నిర్వహిం చారు. కోట్ల మాట్లా డుతూ సచివాలయ ఉద్యోగులు ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే సహించేదిలేదన్నారు. గ్రామాల్లో తిరిగి పారిశుధ్యం, తాగునీటి సమస్యపై దృష్టి పెట్టాలన్నారు. అలాగే మండలస్థాయి అదికారు లు కూడా సచివాలయాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. పనితీరు బాగలేని ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని సూచిం చారు. అంతకుముందు పట్ట ణంలోని రోడ్డు డివైడర్‌పై రూ.30 లక్షలతో నిర్మించనున్న బట్టర్‌ఫ్లై దీపాలకు కోట్ల భూమి పూజ చేశారు. తహసీల్దారు భారతి, డీల్‌డీవో నరసింహారెడ్డి, సీఐ వెంక టరామిరెడ్డి, వై లక్ష్మీనారాయణయాదవ్‌, టి శ్రీను, ఖాజాపీర్‌, పర మేష్‌, సుదర్శన, రామక్రిష్ణ, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 03 , 2025 | 12:18 AM