Share News

రిజర్వాయర్లను నింపడంలో విఫలం

ABN , Publish Date - Aug 03 , 2025 | 12:53 AM

ప్రస్తుతం వస్తున్న వరద నీటితో రిజర్వాయర్లు, చెరువులను నింపడంలో ఇరి గేషన్‌ అధికారులు విఫలమయ్యారని జడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి ఆరోపించారు.

రిజర్వాయర్లను నింపడంలో విఫలం
మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌ పాపిరెడ్డి, పక్కనే ఎమ్మెల్సీ మధుసూదన్‌

పోతిరెడ్డిపాడు నీటిని ఎందుకు వినియోగించుకోవడం లేదు?

యూరియా కొరత లేకుండా చర్యలు చేపట్టాలి

జడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి

ముగిసిన జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు

కర్నూలు, న్యూసిటీ, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం వస్తున్న వరద నీటితో రిజర్వాయర్లు, చెరువులను నింపడంలో ఇరి గేషన్‌ అధికారులు విఫలమయ్యారని జడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి ఆరోపించారు. శనివారం జిల్లా పరిషత్‌ మినీ సమావేశం భవనంలో ఏడు స్థాయీ సంఘ సమావేశాలు జరిగాయి. చైర్మన్‌ అధ్యక్షత వహించగా సీఈవో జి.నాసరరెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ పాపిరెడ్డి మాట్లాడుతూ జలవనరుల శాఖ అధికారులు చొరవ తీసుకుని అన్ని రిజర్వాయర్లను నింపుకు నేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శ్రీశైలం, సాగర్‌, కృష్ణా బ్యారే జీల్లో నీటిమట్టం పూర్తిస్థాయిగా ఉన్నప్పుడు రిజర్వాయర్లు, చెరు వులను ఎందుకు పూర్తిస్థాయిలో నింపుకోలేదని అఽధికారులను ప్ర శ్నించారు. అయిన కూడా జిల్లాలోని చెరువులను నింపలేకపోవడం దారుణమన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి వచ్చే నీటిని ఎందుకు సద్వినియోగం చేసుకోవడం లేదని అధి కారులను ప్రశ్నించారు. కేసీ కెనాల్‌ కింద పంటలకు నీరిందించడంలో కూడా అధికారులు వైఫల్యం చెందార న్నారు. ఉమ్మడి జిల్లాలో రిజర్వాయర్లు తక్కువగా ఉన్నాయని, ఉన్న వాటిని కూడ నింపుకోలేకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంద న్నారు. రైతులకు ఖరీఫ్‌ సీజన్లో నీరు అందించాలని చైర్మన్‌ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉందని ఇటీవల వివిధ పత్రికల్లో కథనాలు వచ్చిన అధికారులు ఎందుకు పట్టించు కోవడం లేదని ప్రశ్నించారు. గత సర్వసభ్య సమావేశంలోనే సభ్యులు ఎరువుల కొరతపై ప్రస్తావించినా కూడా ఆదిశగా అధికారులు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈసమావేశంలో డిప్యూటీ సీఈవో వెం కట సుబ్బారెడ్డి, జడ్పీటీసీలు, సుంకన్న, రంగనాథ గౌడు, సుంకన్న, పోచా జగదీశ్వరరెడ్డి, ఉమ్మడి జిల్లాల అఽధికారులు పాల్గొన్నారు.

రైతులకు అవగాహన కల్పించాలి

పశ్చిమ ప్రాంతంలో పండ్లతోటల పెంపకంపై అధికారులు రైతులకు అవగాహన కల్పించాలి. అవగాహనకు ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వనించాలి. గతంలో అనంతపురం జిల్లా పూర్తిగా నీరు లేకుండా ఉండేది. అయితే ప్రస్తుతం అక్కడ పండ్లతోటల పెంపకం పూర్తిగా అభివృద్ధి ఎలా సాధ్యమైందో అధికారులు చూసుకోవాలి. జిల్లాలో నీటివనరులు ఉన్న కూడా పండ్లతోటల పెంపకంపై ఇంకా పూర్తిస్థాయిలో అవగాహనకు రాలేకపోతున్నారు.

- మధుసూదన్‌, ఎమ్మెల్సీ

ప్రశ్నించేవారే కరువు..

జిల్లాలోని వివిధ మండలాల్లో నెలకొన్న సమస్యను అధికారుల దృష్టికి తీసుకురావాల్సిన జడ్పీ టీసీలు కరువయ్యారు. ఏడు స్థాయీ సంఘ సమా వేశాలు జరగ్గా అందులో కోరం లేకుండానే సమావేశాలను మమ అనిపించారు. ప్రతి సమావే శానికి చైర్మన్‌, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక్క ఎమ్మెల్సీ, ఆరు మంది జడ్పీటీసీలు హాజరుకావాలి. అయితే శనివారం జరిగిన సమావేశాల్లో పూర్తిస్థాయి జడ్పీటీసీలు హాజరు కాలేదు. దీంతో వచ్చినవారు కూడా ఏదో వచ్చామా.. ఏదో అడిగామా అన్నట్లుగా వచ్చి వెళ్లారు.

జడ్పీటీసీలు ఏమన్నారంటే..

కూటమి ప్రభుత్వం 50ఏళ్లకు ఇస్తామని చెప్పిన పింఛన్‌ ఎప్పుడు ఇస్తారని, వర్షాకాలంలో దోమల నివారణకు చర్యలు చేపట్టాలని, మండలంలో గోకులం షెడ్లు మంజూరు చేసి ఎక్కడ కనబడటం లేదని వెల్దుర్తి జడ్పీటీసీ సుంకన్న అన్నారు.

జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలో బుక్‌కీపర్‌ శిరీషను పూర్తిగా ఇబ్బందులు పెడుతున్నారని, ఉద్యో గం నుంచి తొలగిస్తే ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని జడ్పీటీసీ జగదీశ్వరరెడ్డి అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టి గృహనిర్మాణాలను ప్రభుత్వం కంటిన్యూ చేయాలని, పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని, మండలానికి ఎరువులు వస్తున్నాయి..అయితే అవి రైతులకు అందకుండ ఎక్కడికి వెళ్తున్నాయో అర్థం కావడం లేదని కొత్తపల్లి జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి అన్నారు.

బ్రాహ్మణకొట్కూరు జడ్పీ ఉన్నత పాఠశాలకు దగ్గరగా ఉన్న వైప్‌షాపును తొలగించాలని ప్రతి సమావేశంలో చెబుతున్న పట్టించుకోవడం లేదని నందికొట్కూరు జడ్పీటీసీ అన్నారు.

Updated Date - Aug 03 , 2025 | 12:53 AM