Share News

కాలువల కబ్జాపై జిల్లా యంత్రాంగం కన్నెర్ర

ABN , Publish Date - Aug 02 , 2025 | 11:37 PM

జిల్లాలో కాలువలు, చెరువుల కబ్జాలపై జిల్లా యంత్రాంగం కన్నెర్ర చేసింది.

కాలువల కబ్జాపై జిల్లా యంత్రాంగం కన్నెర్ర
ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామంలో ఎల్లెల్సీ డీపీ-65 కాలువపై ఆక్రమణలుతొలగిస్తున్న ఇంజనీర్లు

హెద్దహరివాణంలో ఎల్లెల్సీ డీపీ-65 కాలువపై ఆక్రమణలు తొలగింపు

కాలువను పునరుద్ధరించిన ఇంజనీర్లు

త్వరలో ఎమ్మిగనూరు ఎల్లెల్సీ డీపీ-79 గట్టు ఆక్రమణల తొలగింపు

కర్నూలు, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కాలువలు, చెరువుల కబ్జాలపై జిల్లా యంత్రాంగం కన్నెర్ర చేసింది. హంద్రీ, ఎల్లెల్సీ, మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులు ఆక్రమణలు గుర్తించి తొలగించాలని గత నెల 5న జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ) బి.నవ్య జలవనరుల శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. తాతా ల్కిక నిర్మాణాలు, షెడ్లు తక్షణమే తొలగించి కాలువలు పునరుద్ధరిం చాలని చెప్పారు. తుంగభద్ర దిగువ కాలువ (టీబీపీ ఎల్లెల్సీ) పశ్చిమ పల్లెసీలమ జీవనాడి. ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామంలో ఆదోని-సిరుగుప్ప ప్రధాన రహదారిలో డిమాండ్‌ ఉండడడంతో ఎల్లెల్సీ డీపీ-65 కాలువ (ఫీల్డ్‌ చానల్‌) గట్టను ఆక్రమించి 10-15 తాత్కాలిక షెడ్లు, శాశ్వత నిర్మాణాలు చేపట్టారు. మండల కేంద్రం సి.బెళగల్‌లో చెరువు స్థలం, ఫీల్డ్‌ చానల్‌ కబ్జాకు గురైంది. ఎమ్మిగనూరు పట్టణంలో ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ నుంచి లక్ష్మణ్‌ థియేటర్‌, ఓంశాంతి కూడలి, వ్యవసాయ మార్కెట్‌ యార్డు మీదుగా ముగతి వరకు ప్రవహించే టీబీపీ ఎల్లెల్సీ డీపీ-79 కాలువ గట్టును రాజకీయ అండతో ఆక్రమించి తాత్కాలిక రేకుల షెడ్లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ భాగోతాన్ని ‘కాలువలు కబ్జా’ అనే శీర్షికతో గత నెల 5న ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. అధికారులు స్పందించి నోటీసులు జారీ చేశారు. కబ్జాలు తొలగించకపోవడంతో జేసీ బి.నవ్య ఆదేశాల మేరకు టీబీపీ ఎల్లెల్సీ ఈఈ, హంద్రీ-నీవా ప్రాజెక్టు కర్నూలు సర్కిల్‌ -1 ఎస్‌ఈ పాండురంగయ్య సూచనలతో ఎల్లెల్సీ డీఈఈ షఫీ, ఏఈఈ ఈశ్వర్‌, రెవెన్యూ అధికారులు పెద్దహరివాహణం గ్రామంలో ఎల్లెల్సీ డీపీ-65 కాలువ (ఫీల్డ్‌ చానల్‌) గట్టపై అక్రమ నిర్మాణాలను ఎక్స్‌కవేటర్ల ద్వారా తొలటించారు. కాలువను పునరుద్ధరించారు. త్వరలోనే ఎమ్మిగనూరు పట్టణంలో ఎల్లెల్సీ డీపీ-79 కాలువ గట్టుపై ఆక్రమణలు తొలగిస్తామని ఎస్‌ఈ పాండురంగయ్య ఆంధ్రజ్యోతికి వివరించారు. కాలువలను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - Aug 02 , 2025 | 11:37 PM