పిడుగు పడి కొబ్బరి చెట్టు దగ్ధం
ABN , Publish Date - Apr 29 , 2025 | 12:53 AM
పిడుగు పడి కొబ్బరి చెట్టు దగ్ధమైంది.

ఓర్వకల్లు, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): పిడుగు పడి కొబ్బరి చెట్టు దగ్ధమైంది. ఓర్వకల్లు మండలంలో సోమవారం సాయంత్రం భారీ ఉరుములు, మెరుపులతో అకాల వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల పిడుగులు పడ్డాయి. మండలంలోని లొద్దిపల్లె గ్రామంలో ఎస్సీ కాలనీలోని పిలీపు ఇంటి వద్ద ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడి కాలిపోయింది. ఆ సమయంలో ఇంటి వద్ద ఆడుకుంటున్న పిలీపు కుమార్తె కస్తూరి చేతికి నిప్పురవ్వలు తగిలి స్పల్ప గాయాలయ్యాయి.