Share News

రవి ఆపరేషన్‌కు సీఎం ఆర్థిక సాయం

ABN , Publish Date - Dec 13 , 2025 | 12:36 AM

సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఏడాదిగా తీవ్ర అనారోగ్యానికి గురైన ఓవ్యక్తి వైద్యం చేయించుకునేందుకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద వైద్య ఖర్చులకు రూ.15లక్షలు మంజూరు చేశారు.

రవి ఆపరేషన్‌కు సీఎం ఆర్థిక సాయం
చంద్రబాబుకు సమస్య తెలుపుతున్న రోగి కుటుంబీకులు ... విష్ణు, దస్తగిరి నుంచి చెక్కు అందుకుంటున్న బాధితులు

వైద్య ఖర్చులకు రూ.15లక్షలు మంజూరు

కర్నూలు రూరల్‌ డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఏడాదిగా తీవ్ర అనారోగ్యానికి గురైన ఓవ్యక్తి వైద్యం చేయించుకునేందుకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద వైద్య ఖర్చులకు రూ.15లక్షలు మంజూరు చేశారు. హైదరాబాద్‌ యశోద ఆసుపత్రి యాజమాన్యంతో సీఎం మాట్లాడారు. వెంటనే రోగికి ఆపరేషన్‌ చేయాలని అందుకయ్యే ఖర్చు డబ్బులను మంజూరు చేసినట్లు ఆసుపత్రి యాజమాన్యంకు ఆదేశించారు. వివరాలు.. కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లెకి చెందిన బళ్లారి రవి ఏడాది నుంచి లివర్‌ సమస్యతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. శరీరంలో ఉన్న లివర్‌ కొంతభాగం దెబ్బతి నిందని ఆపరేషన్‌ చేసి మార్పులు చేయాలని వైద్యులు సూచిం చారు. ఆపరేషన్‌ నిమిత్తం హైదరాబాదు యశోద ఆసుపత్రిలో సంప్రదించగా, అందుకు దాదాపు రూ.35లక్షలు ఖర్చు అవుతుందని అక్కడి వైద్యులు చెప్పారు. ఆపరేషన్‌ చేయించే స్థోమత లేక పసుపుల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్‌ వెంకటరాముడు ఆధ్వర్యంలో కేడీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్దన్‌ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరిని ఆశ్రయించారు. వారి సహకారంతో రవి కుటుంబం అమరావతిలో సీఎం చంద్ర బాబును కలిశారు. అతడి వ్యాధి గురించి ఎమ్మెల్యే దస్తగిరి సీఎం వివరించారు. వెంటనే స్పందించిన చంద్రబాబు ఆపరేషన్‌ చేయించుకోవాలని రూ.15లక్షల ఎల్‌వోసీ చెక్కును మంజూరుచేసి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. యశోద ఆసుపత్రి యాజమాన్యంతో సీఎం మాట్లాడి రవిని అడ్మిట్‌ చేసుకోవాలని ఆదేశించారు. రవి కుటంబీకులు కర్నూలుకు చేరుకొని శుక్రవారం కేడీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్దన్‌ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరిని కలిశారు. సీఎం మంజూరుచేసిన రూ.15లక్షల ఎల్‌వోసీ చెక్కును విష్ణుకు చూపించారు. ఈసందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు సీఎం, ఎమ్మెల్యే, కేడీసీసీబీ చైర్మన్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Dec 13 , 2025 | 12:36 AM