నేటి తరం నటులకు ఆదర్శం బళ్లారి రాఘవ
ABN , Publish Date - Aug 02 , 2025 | 11:45 PM
కళామతల్లి ముద్దుబిడ్డగా నేటితరం నటులకు ఆదర్శప్రాయంగా బళ్లారి రాఘవాచార్య నిలిచారని డీఆర్వో రామునాయక్ అన్నారు.

డీఆర్వో రామునాయక్
నంద్యాల కల్చరల్, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): కళామతల్లి ముద్దుబిడ్డగా నేటితరం నటులకు ఆదర్శప్రాయంగా బళ్లారి రాఘవాచార్య నిలిచారని డీఆర్వో రామునాయక్ అన్నారు. నంద్యాల కలెక్టరేట్‌లో శనివారం బళ్లారి రాఘవాచార్య జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి జిల్లా అధికారులు పూలమాల వేసి నివాళి అర్పించారు. డీఆర్వో మాట్లాడుతూ రంగస్థల నాటకానికి బళ్లారి రాఘవాచార్య విశేష సేవలు అందించారన్నారు. నాటక రంగంలో వైవిధ్యమైన పాత్రలు ధరించి పరిణితి చెందిన కళాకారుడిగా గుర్తింపు పొందారన్నా రు. నాటక ప్రదర్శనలో భాగంగా ఇంగ్లాండ్‌లో పర్యటించిన రాఘవాచా ర్య నాటక ప్రదర్శనలు చూసి బెర్నాడ్ షా మెచ్చుకున్నారన్నారు. కలెక్టరేట్‌లోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.