Share News

మొదటి సెమిస్టర్‌ పరీక్షలపై విచారణ చేపట్టాలి

ABN , Publish Date - Apr 29 , 2025 | 12:48 AM

రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న బీఎడ్‌ కళాశాలల మొదటి సెమిస్టర్‌ పరీక్షలపై సమగ్ర విచారణ చేపట్టాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య, యూఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శేఖర్‌ నాయుడు ఉదయ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.

మొదటి సెమిస్టర్‌ పరీక్షలపై విచారణ చేపట్టాలి
కలెక్టర్‌కు వినతి పత్రం ఇస్తున్న నాయకులు

కర్నూలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న బీఎడ్‌ కళాశాలల మొదటి సెమిస్టర్‌ పరీక్షలపై సమగ్ర విచారణ చేపట్టాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య, యూఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శేఖర్‌ నాయుడు ఉదయ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టర్‌ రంజిత బాషాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో ఉన్న బీఎడ్‌ కళాశాలలో ఈ నెల 23న మొదటి సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే పరీక్షలు రాస్తున్న విద్యార్థుల నుంచి కళాశాలల యాజమాన్యం ముడుపులు పుచ్చుకుని ఒకరోజు ముందే దాదాపు 40 మంది విద్యార్థుల దగ్గర బీఎడ్‌ అడ్మిషన్లు తీసుకుని మరుసటి రోజే పరీక్షలకు అనుమతినిచ్చిందన్నారు. అలాగే ఆదోనిలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స కాలేజీలో కర్నూలు నగరంలోని ఉస్మా నియా కాలేజీలో అభ్యర్థులను మార్చి పరీక్షలను రాయిస్తున్న కూడా ఆర్‌యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు.

జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలి: జిల్లాలో వివిధ మీడియా సంస్థల్లో పని చేస్తున్న జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలని యూనైటెడ్‌ జర్నలిస్టు ఫోరం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.విద్యాసాగర్‌, డి.చంద్రమోహన, ఎలక్ర్టానిక్‌ మీడియా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజయ్‌, మధు, నగర కార్యదర్శి మునిస్వామిలు ప్రభు త్వాన్ని కోరారు. వ్యవస్థాపక అధ్యక్షులు నీలం సత్యనారాయణ పి.చంద్రమోహన, మధు మాట్లాడుతూ గత ప్రభు త్వ హయాంలో జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. 142 జీవో అమలు చేసి అక్రిడిటేషన్ల కోత పెట్టడంతో జర్నలిస్టులకు నష్టం వాటిల్లిందన్నారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌ రంజిత బాషాకు వారు వినతిపత్రం అందజేశారు. నాయకులు కిషోర్‌, జి.విజయ్‌, కుమార్‌, వి.విజయకుమార్‌, నగర కోశాధికారి సంధ్య ప్రసాద్‌, కల్లూరు మండల కార్యదర్శి లోకేశ, రాజు, దామోదరం సంజీవయ్య పాల్గొన్నారు.

ఫ ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి గతంలో మెడికల్‌ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్‌తో నిర్ధారించిన అంగవైకల్య శాతం కంటే ప్రస్తుతం మెడికల్‌ బోర్డులో గణనీయంగా తగ్గించడం వల్ల నష్టపోయిన ఉపాధ్యా యులకు తిరిగి అంగవైకల్య నిర్ధారణ పరీక్షలు చేపట్టాలని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఇస్మాయిల్‌ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మరియానందం, ఎన్నికల కమిటీ సభ్యుడు టీవీ రామకృష్ణయ్య, పీఈటీ స్కూల్‌ అసిస్టెంట్‌ అసోసియేషన జిల్లా అధ్యక్షుడు జి.లక్ష్మయ్య పాల్గొన్నారు.

ఫ ఉమ్మడి జిల్లాలోని కోడుమూరు, పత్తికొండ, వెల్దుర్తి, క్రిష్ణగిరి, తదితర మండలాల్లో ఎక్కువ శాతం బర్లి పొగాకును పండించారని, జీపీఐ అలయన్స ఐటీసీ వారు పొగాకును కొంటామని ఇప్పుడు కొనడం లేదని, ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పొగాకును కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం, జిల్లా సమితి కర్నూలు గౌరవాధ్యక్షుడు కె.జగన్నాథం, అధ్యక్షుడు కే.నాగేంద్రయ్య, కార్యదర్శి పి.పంపన్నగౌడు కోరారు.

Updated Date - Apr 29 , 2025 | 12:48 AM