12వ పీఆర్సీ కమిటీని నియమించాలి: ఫ్యాప్టో
ABN , Publish Date - Aug 02 , 2025 | 11:46 PM
12వ పీఆర్సీ కమిటీని నియమించాలని, పెండింగ్‌లో ఉన్న కరువు భత్యాలను విడుదల చే యాలని ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకులు హృదయరాజు, నంద్యాల జిల్లా చైర్మన్ శివయ్య డిమాండ్ చేశారు.

నంద్యాల ఎడ్యుకేషన్, ఆగస్ట 2(ఆంధ్రజ్యోతి): 12వ పీఆర్సీ కమిటీని నియమించాలని, పెండింగ్‌లో ఉన్న కరువు భత్యాలను విడుదల చే యాలని ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకులు హృదయరాజు, నంద్యాల జిల్లా చైర్మన్ శివయ్య డిమాండ్ చేశారు. నంద్యాల కలెక్టరేట్ ఎదుట ఎదుట శనివారం ధర్నా చేపట్టారు. వారు మాట్లాడుతూ పీ4 కార్యక్రమాన్ని ఉపాఽధ్యాయులకు నిర్బంధం చేయకూడదన్నారు. నూతనంగా అప్‌గ్రేడ్ అయిన స్థానాలను కోరుకున్న ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు చెల్లించాలన్నారు. ఏకీకృత సర్వీసు రూల్స్ సమస్యలు పరిష్కరించి విద్యాశాఖలో అసంబద్ధతను తొలగించాన్నారు. ఇలా 17 డిమాండ్లతో ధర్నా నిర్వహించి అనంతరం డీఆర్వో రామునాయక్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు దస్తగిరిబాషా, మౌలాలి, ఆజాంబేగ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.