Big Shock To YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. మరో నేత జంప్
ABN , Publish Date - Mar 19 , 2025 | 10:38 AM
Big Shock To YSRCP: వైసీపీకి మరో కీలక నేత గుడ్‌బై చెప్పేశారు. శాసనమండలిలో వైసీపీకి పెద్ద షాకే తగిలింది. మరో ఎమ్మెల్సీ ఆ పార్టీకి రాజీనామా చేశారు.

అమరావతి, మార్చి 19: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YSRCP) మరో బిగ్ షాక్ తగిలింది. మరో నేత వైసీపీకి గుడ్‌బై చెప్పేశారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ (MLC Marri Rajasekhar) పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటి వరకు నలుగురు ఎమ్మెల్సీలు పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పోతుల సునీత, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ పార్టీకి రిజైన్ చేశారు. ఇప్పుడు తాజాగా మర్రి రాజశేఖర్ రాజీనామాతో వైసీపీ అసంతృప్త ఎమ్మెల్సీల సంఖ్య ఐదుకు చేరింది.
కాగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి మర్రి రాజేశేఖర్ ఆ పార్టీలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి మర్రికి టికెట్ ఇవ్వగా.. ఆ ఎన్నికల్లో అతడు ఓటమిపాలయ్యాడు. ఇక 2019లో ఆయనకు అవకాశం దక్కలేదు. అంతకు ముందే పార్టీలో చేరిన విడదల రజినీకి అవకాశం ఇచ్చారు జగన్. ఇక 2024 ముందు వైసీపీ ఎమ్మెల్సీగా పదవి పొందారు మర్రి రాజశేఖర్. 2024 ఎన్నికల్లో చిలకలూరిపేట టికెట్ ఆశించినప్పటికీ మర్రికి మరో సారి ఆశాభంగమే కలగడంతో అప్పటి నుంచి ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 2024 ఎన్నికలు ముగిశాక కూడా రజినీకే చిలకలూరిపేట ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించడంతో మర్రి రాజశేఖర్ మరింత అసహనానికి లోనైనట్లు ఆయన వర్గీయులు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మర్రి రాజశేఖర్ పార్టీ మారతనే వార్తలు రాగా.. ఇప్పుడు అవి నిజమయ్యాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న మర్రి రాజశేఖర్ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.
కాగా.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన జగన్.. ఆ షాక్ నుంచి తేరకోకముందే షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. జగన్ వైఖరి నచ్చకనో.. లేక పార్టీలో ఇమడలేకనో తెలియదు కానీ ఒక్కొక్కరుగా నేతలు పార్టీని వీడుతూ వస్తున్నారు. పార్టీ ముఖ్యనేతలు కూడా జగన్‌కు, పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. అన్నీ తామై వ్యవహరించిన నేతలు కూడా పార్టీకి టాటా చెప్పేస్తున్నారు. కొందరు నేతలు పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలల్లోకి జంప్ అవ్వాలని చూస్తుండగా.. మరికొందరు మాత్రం వైసీపీకి రాజీనామా చేశాక ఏ పార్టీలోకి వెళ్లకుండా సైలెంట్‌గానే ఉండిపోతున్నారు. ఇక పార్టీలో ఉన్న మరికొందరు పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోని పరిస్థితి. గత ప్రభుత్వంలో ఎగిరెగిరిపడిన నేతలంతా కూడా ఓటమి పాలైన తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయిన విషయం కూడా తెలిసిందే. ఇక ఆ పార్టీ ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే నలుగురు పార్టీకి రాజీనామా చేయగా.. తాజాగా మరో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కూడా వైసీపీని వీడారు.
ఇవి కూడా చదవండి...
Sunita Williams: రోజుకు 16 సార్లు సూర్యోదయం.. సునీతా విలియమ్స్ అనుభవాలు ఇవే..
Hyderabad: హలో నాగమణి.. అమ్మాయి కావాలి
Read Latest AP News And Telugu News