Supreme Court : ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ ముందస్తు బెయిల్ రద్దు
ABN , Publish Date - Jul 31 , 2025 | 01:31 PM
AP Ex CID Chief: ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ ముందస్తు బెయిల్ విచారణలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అవినీతి కేసులో సంజయ్‌కు ముందస్తు బెయిల్ ఇస్తూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ ఇవాళ(గురువారం) ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

ఢిల్లీ, జులై 31: ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ ముందస్తు బెయిల్ విచారణలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అవినీతి కేసులో సంజయ్‌కు ముందస్తు బెయిల్ ఇస్తూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేస్తూ ఇవాళ(గురువారం) ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
అగ్నిమాపక విభాగంలో అవినీతి కేసులో ఆయనపై ఏపీ ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో సంజయ్‌కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఉన్నత న్యాయస్థానం తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనిపై సుదీర్ఘ వాదనల తర్వాత జస్టిస్ అమానుతుల్లా, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి ధర్మాసనం ఇవాళ తీర్పు వెలువరించింది. విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్ దశలోనే ట్రయల్‌ను పూర్తి చేసినట్టు ఉందని వ్యాఖ్యానించింది.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి