Share News

PSR Anjaneyulu Arrest News: విజయవాడ సీఐడీ కార్యాలయానికి పీఎస్‌ఆర్ ఆంజనేయులు

ABN , Publish Date - Apr 22 , 2025 | 01:37 PM

PSR Anjaneyulu Arrest News: ముంబై నటి జెత్వానీ కేసులో అరెస్ట్ అయిన పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును విజయవాడ సీఐడీ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం పీఎస్‌ఆర్‌ను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.

PSR Anjaneyulu Arrest News: విజయవాడ సీఐడీ కార్యాలయానికి పీఎస్‌ఆర్ ఆంజనేయులు
PSR Anjaneyulu Arrest News

అమరావతి, ఏప్రిల్ 22: ఇంటెలిజెన్స్ మాజీ డీజీ పీఎస్‌ఆర్ ఆంజనేయులును (PSR Anjaneyulu) ఏపీ పోలీసులు (AP Police) విజయవాడకు తీసుకువచ్చారు. కాసేపటి క్రితమే విజయవాడ సీఐడీ రీజినల్ కార్యాలయానికి ఆంజనేయులును తరలించారు. ముంబై నటి జెత్వానీ (Actress Jethwani) కేసుకు సంబంధించి, వైసీపీ హయాంలో అనేక కేసుల్లో పాల్పడిన అక్రమాలకు సంబంధించి విచారణ జరుగనుంది. నటి జెత్వానీ వేధింపుల కేసులో పీఎస్‌ఆర్‌ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయవాడ సీఐడీ కార్యాలయంలో పీఎస్‌ఆర్‌ను విచారించి ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఆయన బెయిల్‌కు కూడా అప్లై చేయలేదు. ఈరోజు (సోమవారం) ఉదయం హైదరాబాద్‌లోని కుందన్‌బాగ్‌లో పీఎస్‌ఆర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇచ్చి.. ఆపై విజయవాడకు తీసుకొచ్చారు.


నటి జెత్వానీ కేసులో పీఎస్‌ఆర్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తారు. తరువాత న్యాయమూర్తి ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. అర్ధరాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. గతంలో నటి కాదంబరి జెత్వానీని అప్పటి ప్రభుత్వం పెద్దలు చెప్పిన మేరకు ముంబై నుంచి ఇక్కడకు తీసుకొచ్చి.. వీటీపీఎస్‌కు సంబంధించిన గెస్ట్‌హౌస్‌లో ఉంచి వేధింపులకు గురిచేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా నటి కుటుంబసభ్యులపై కూడా కేసులు పెట్టి వేధించారు. ఓ పారిశ్రామికవేత్తపై ఉన్న కేసును విత్‌డ్రా చేసేందుకు తనను ఇలా ఇబ్బందులకు గురిచేశారని నటి ఆరోపించారు కూడా. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తనకు న్యాయం చేయాలంటూ నటి కోరారు. ఆ సమయంలో ఈ వ్యవహారాన్ని అధ్యయనం చేసిన కూటమి ప్రభుత్వం.. సీఐడీకి ఈ కేసును అప్పగించింది. కేసు నమోదు చేసిన సీఐడీ.. ఈ కేసులో భాగ్యస్వాములైన పీఎస్‌ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్నీ, క్రాంతి రాణా టాటాను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే విశాల్‌ గున్నీ, క్రాంతి రాణా టాటా కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకోగా.. పీఎస్‌ఆర్ మాత్రం బెయిల్‌ కూడా దరఖాస్తూ చేసుకోలేదు.


అలాగే మాజీ ఎంపీ రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి కూడా పీఎస్‌ఆర్‌పై అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ రెండు కేసులకు సంబంధించి ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రధానంగా నటి జెత్వానీ కేసుకు సంబంధించే పీఎస్‌ఆర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్ తరలించనున్నారు. ఆ తరువాత కోర్టు ద్వారా అనుమతి పొందిన అనంతరం ఒక్కొక్క కేసుపై పీటీ వారెంట్ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి

Operation Karreguttalu: కర్రెగుట్టల్లో టెన్షన్ టెన్షన్.. ఏం జరుగబోతోంది

JD Vance Jaipur Tour: అంబర్‌ కోటను సందర్శించిన జేడీ వాన్స్ కుటుంబం

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 22 , 2025 | 01:53 PM