Padma Awards: రాష్ట్రపతి భవన్‌లో సోమవారం పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
ABN , Publish Date - Apr 27 , 2025 | 11:28 AM
పద్మా అవార్డుల ప్రదానోత్సవం సోమవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో జరగనుంది. ఎంపికైనవారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదానం చేస్తారు. నందమూరి బాలకృష్ణ పద్మవిభూషణ్ అవార్డును అందుకోనున్నారు.

న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan)లో సోమవారం పద్మ అవార్డుల (Padma Awards) ప్రదానోత్సవం జరగనుంది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. నందమూరి బాలకృష్ణ పద్మవిభూషణ్ అవార్డును రాష్ట్రపతి చేతులమీదుగా అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి నారా లోకేష్ దంపతులు సోమవారం ఢిల్లీ రానున్నారు.
Also Read..: Kaleswaram Case: ఈఎన్‌సీ హరి రామ్‌కు 14 రోజుల రిమాండ్..
కాగా నటన అనేది ఓ ఉద్యోగంలా భావించకుండా ఓ కళగా ఆరాధించే నటుడు నందమూరి బాలకృష్ణ. అటు నటన, ఇటు రాజకీయాలు, మరో పక్క వైద్యరంగంలో సేవలు.. ఇలా ఐదు దశాబ్దాల నుంచి విరామం లేకుండా పని చేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమకు విశేషసేవలు అందిస్తున్న బాలకృష్ణ కృషికి గుర్తింపుగా ఇప్పుడు పద్మభూషణ్ పురస్కారం లభించడంతో అన్ని వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. అప్పుడెప్పుడో 1960ల్లో సీనియర్ ఎన్టీఆర్‌కు పద్మశ్రీ పురస్కారం లభించింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ నందమూరి వంశానికి పద్మ పురస్కారం లభించడం ఇదే. ఐదు దశాబ్దాల బాలకృష్ణ నట జీవితంలో భారీ విజయాలే కాదు.. కొన్ని పరాజయాలూ ఉన్నాయి. అపజయానికి ఆయన ఎప్పుడూ కుంగిపోలేదు. విజయానికి దగ్గిర దారులు వెదుక్కుంటూ రాజీ పడలేదు. డైలాగ్ చెప్పడంలో బాలకృష్ణది ఒక ప్రత్యేక ఒరవడి. కళ్ల వెంట నిప్పులు కురిపిస్తూ బేస్ వాయిస్‌లో ఆయన తెరపై డైలాగులు చెబుతుంటే థియేటర్లు దద్దరిల్లి పోతుంటాయి. తండ్రి ఎన్టీఆర్‌లా బాలకృష్ణకు కూడా తెలుగు భాష అంటే ఎంతో గౌరవం. సినిమాల్లో తెలుగుదనం ఉట్టిపడే పదాలతో డైలాగులు చెప్పే బాలయ్య నిజజీవితంలో కూడా తన ఆహార్యం, అలవాట్లతో ప్రత్యేకంగా కనిపిస్తారు. క్రమశిక్షణకు ప్రాణం ఇస్తారు బాలకృష్ణ. అలాగే ఆయనది ముక్కుసూటితత్వం. నాన్చుడు వ్యవహారం ఆయనకు నచ్చదు. మనసులో ఏముందో అది బయటకు చెప్పడం, నిజాన్ని నిర్భయంగా వెల్లడించడం అలవాటు. ఆరు పదుల వయసులో కూడా ఎంతో చలాకీగా ఉంటూ యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు బాలకృష్ణ. ‘అన్‌స్టాపబుల్’ కార్యక్రమంతో దేశ వ్యాప్తంగా ఆయన క్రేజ్ సంపాదించుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాదులో హెచ్ఐసీసీలో భారత్ సమీట్..
ఏఎంసీలో శతాబ్ది భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
నేను భారత్ కోడలిని.. ఇక్కడే ఉంటా
For More AP News and Telugu News