Share News

Liquor Scam: సిట్ విచారణకు సాయిరెడ్డి.. ఇక నిజాలు బయటపడినట్టేనా

ABN , Publish Date - Apr 17 , 2025 | 03:57 PM

Liquor Scam: వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగి మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి చెప్పే అంశాలు కీలకంకానున్నాయని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈరోజు విచారణకు సాయిరెడ్డి గైర్హాజరయ్యారు.

Liquor Scam: సిట్ విచారణకు సాయిరెడ్డి.. ఇక నిజాలు బయటపడినట్టేనా
Liquor Scam

అమరావతి, ఏప్రిల్ 17: గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కాం వ్యవహారానికి సంబంధించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Former MP Vijayasai Reddy) రేపు (శుక్రవారం) సిట్ ముందు విచారణకు హాజరుకానున్నారు. నేటి విచారణకు పలు కారణాలతో హాజరుకాలేకపోయినట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. రేపు విచారణకు హాజరవుతానని సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సాక్షిగా విజయసాయి చెప్పే అంశాలు మద్యం కుంభకోణం కేసులో కీలకం అవుతాయని అధికారులు చెబుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు కీలకమైన సమాచారాన్ని సేకరించారు.


దర్యాప్తులో భాగంగా ఈ వ్యవహారం మొత్తం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని నిర్ధారించారు. దీంతో ఆయన మూడు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ గైర్హజారయ్యారు. అలాగే కసిరెడ్డి ఫోన్లు కూడా స్విచ్ఆఫ్‌లో ఉన్నాయి. కసిరెడ్డి రాకపోవడంతో కుటుంబసభ్యులకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. గత ఐదేళ్లలో మద్యం ద్వారానే కసిరెడ్డి అక్రమంగా ఆస్తులను సంపాదించారని గుర్తించారు. ఆ డబ్బు ద్వారానే అనేక సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని, సినిమా తీశారని సిట్ అధికారులు గుర్తించారు. దీంతో ఈ కేసులో మరింత లోతుగా విచారించాలని భావించిన సిట్ అధికారులు.. పాత్రధారులు, సూత్రధారులను విచారించేందుకు సన్నద్ధమవుతున్నారు.

TTD Goshala Controversy: ఆ గోశాలలో జరిగిందంతా కామెడీ షో


ఇదిలా ఉండగా.. మద్యం కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డే అంటూ ఇటీవల విజయసాయిరెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. ఆయన నుంచి మరింత సమాచారం సేకరించేందుకు సాక్షిగా వచ్చి తన వద్ద ఉన్న వివరాలను ఇవ్వాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. రేపు (శుక్రవారం) విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొనగా.. ఈరోజే వస్తానని సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈరోజు ఉదయం ఆయన వస్తారని సిట్ అధికారులు భావించారు. అయితే మధ్యాహ్నం అవుతున్నప్పటికీ రాకపోవడంతో సిట్ ఆఫీసర్స్ ఆరా తీయగా.. తాను కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నానని.. రేపు (శుక్రవారం) తప్పకుండా హాజరవుతానని సమాచారం పంపినట్లు తెలుస్తోంది. దీంతో రేపు విజయసాయిరెడ్డి విచారణకు హాజరై మద్యం కుంభకోణానికి సంబంధించిన వివరాలు అందజేస్తారని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఆయన చెప్పిన అంశాలతో ఈ కేసులో మరింత పురోగతి సాధించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Raj Tarun Parents: హైడ్రామాకు తెర.. ఇంట్లోకి వెళ్లిన రాజ్‌తరుణ్ పేరెంట్స్

Mithun Reddy High Court: ఏపీ హైకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్.. ఎందుకంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 17 , 2025 | 04:29 PM