Vijayasai Reddy Tweet: మద్యం కుంభకోణంపై సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 22 , 2025 | 10:43 AM
Vijayasai Reddy Tweet: మద్యం కుంభకోణంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. లిక్కర్ స్కామ్‌లో తన పాత్ర విజిల్ బ్లోయర్ మాత్రమే అని చెప్పుకొచ్చారు.

అమరావతి, ఏప్రిల్ 22: గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ (Liquor Scam) ఎంతటి దుమారాన్ని రేపుతుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సిట్ అనేక ఆధారాలను సేకరించింది. వాటి ఆధారంగా పలువురిని ప్రశ్నించింది కూడా. అలాగే మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Former MP Vijayasaireddy) కూడా సాక్షిగా సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారు. ఇప్పుడు తాజాగా మద్యం కుంభకోణంపై మాజీ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్‌లో తన పాత్ర విజిల్ బ్లోయర్ మాత్రమే అంటూ ట్వీట్ చేశారు. ఇందులో నుంచి తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు తన పేరును లాగుతున్నారని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ దొంగలను బయటకు లాక్కొచ్చేందుకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.
విజయసాయి ట్వీట్ ఇదే
‘ఏపీ లిక్కర్ స్కామ్‌లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకు దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరును లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
అయితే లిక్కర్ స్కామ్‌లో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి అరెస్ట్ తర్వాత సాయిరెడ్డి ఈ మేరకు ట్వీట్ చేయడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే మొదటి నుంచి లిక్కర్ స్కామ్‌లో కర్త, కర్మ, క్రియ అంతా కూడా కసిరెడ్డే అంటూ చెప్పుకొచ్చారు మాజీ ఎంపీ. ఈ కేసుకు సంబంధించి సాక్షిగా సిట్ అధికారులకు వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఇటీవల సిట్ విచారణకు హాజరైన సాయిరెడ్డి.. మద్యం కుంభకోణం వ్యవహారం అంతా నడించింది కసిరెడ్డి ఆధ్వర్యంలోనే అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాజాగా మరోసారి లిక్కర్ స్కామ్‌పై విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది.
AV Ranganath: ఆక్రమణలు తొలగించండి.. లేదా కూల్చేస్తాం
మరోవైపు ఈకేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నిన్న రాత్రి హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనను విజయవాడకు తీసుకుచ్చిన తర్వాత నిన్న రాత్రి 11 గంటల నుంచి ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల వరకు కసిరెడ్డిని సిట్ అధికారులు విచారించారు. రాత్రి నాలుగు గంటల పాటు రాజ్ కసిరెడ్డిని విచారించిన సిట్ బృందం ఉదయం నుంచి ప్రశ్నించడం మొదలుపెట్టింది. ఈ కేసుకు సంబంధించి కసిరెడ్డి నుంచి సమాచారాన్ని రాబట్టేందుకు సిట్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సేకరించిన ఆధారాలు, పలువురు స్టేట్‌మెంట్ల ఆధారంగా రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Censorship: 5 నెలల్లో మోదీ ప్రభుత్వం 130 సెన్సార్‌షిప్ ఆదేశాలు జారీ..పౌరుల స్వేచ్ఛను కాపాడేందుకేనా..
Zeeshan Siddique: బాబా సిద్ధిఖీ తర్వాత జీషన్ టార్గెట్..నీ తండ్రిలాగే నిన్ను చంపేస్తామని బెదిరింపు
Read Latest AP News And Telugu News