Share News

Tuni Train Incident Case: తుని రైలు ఘటన కేసు ఉపసంహరణపై కాపు జేఏసీ హర్షం

ABN , Publish Date - Jul 07 , 2025 | 03:33 AM

తుని రైలు దహన ఘటనపై నమోదైన కేసును ఉపసంహరించుకోవడం పట్ల రాష్ట్ర కాపు జేఏసీ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జేఏసీ సమావేశం జరిగింది.

Tuni Train Incident Case: తుని రైలు ఘటన కేసు ఉపసంహరణపై కాపు జేఏసీ హర్షం

విజయవాడ (గాంధీనగర్‌), జూలై 6(ఆంధ్రజ్యోతి): తుని రైలు దహన ఘటనపై నమోదైన కేసును ఉపసంహరించుకోవడం పట్ల రాష్ట్ర కాపు జేఏసీ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జేఏసీ సమావేశం జరిగింది. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు ప్రత్యేక బీసీ రిజర్వేషన్‌ కల్పించాలని, కాపులపై దాడులను అరికట్టాలని, కృష్ణాజిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని సమావేశం తీర్మానించింది. కాపు కార్పొరేషన్‌కు ఏటా రూ.3 వేల కోట్ల నిధులు మంజూరు చేయాలని, కాపుల జనాభా దామాషా మేరకు నామినేటెడ్‌ పదవులు కేటాయించాలని తీర్మానించారు.

Updated Date - Jul 07 , 2025 | 03:35 AM