మురుగునీటి కాలువతో అల్లాడుతున్నాం..
ABN , Publish Date - Jul 31 , 2025 | 11:56 PM
మేజర్ గ్రామ పంచా యతీ అయినమోరగుడి గ్రామం లో మురుగునీటి కాలువతో ఇబ్బం దులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.

జమ్మలమడుగు, జూలై 31 (ఆంధ్రజ్యోతి): మేజర్ గ్రామ పంచా యతీ అయినమోరగుడి గ్రామం లో మురుగునీటి కాలువతో ఇబ్బం దులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. గ్రామంలో ఎక్కువ మంది చేనేత కార్మికులు నివాసం ఉన్నారు. జమ్మలమడుగు, మోరగుడి గ్రామాల మధ్య మూడు రోడ్ల కూడలి వద్ద నుంచి మోరగుడి శ్రీరాములపేట వరకు డ్రైనేజీ సమస్య ప్రజలకు శాపంగా మారిందని వాపో తున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కొన్ని సంవత్సరాలుగా నాయకులకు, అధికారులను కోరుతున్నా ఎవరు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. ఈ సమస్యకు సంబందించి స్థానిక సర్పంచ్ కొండయ్యను ‘ఆంధ్రజ్యోతి’ సమస్యను తెలుపగా గ్రామ పంచాయతీలో నిధులు లేవని, 15వ ఆర్థిక సంఘం నిధులతో ఆందోళనబాట పట్టినా ఇంతవరకు డబ్బులు మంజూరు కాలేదన్నారు. మోరగుడి గ్రామంలో డ్రైనేజీ సమస్య రంగునీళ్ల కాలువ వద్ద సమస్యలు ఉన్నాయన్నారు.