Share News

కుందూలో నీరు.. వరి జోరు

ABN , Publish Date - Jul 31 , 2025 | 11:54 PM

కుందూన ది పరివాహక ప్రాంతం వెంబడి పచ్చదనం పరుచుకుంటోంది.

కుందూలో నీరు.. వరి జోరు
జోరుగా వరిసాగు

కూందూనదికి భారీగా ప్రవహిస్తున్న వరద నీరు పరివాహక ప్రాంతంలో ముమ్మరంగా వరినాట్లు ఆనందంలో అన్నదాతలు

రాజుపాలెం, జూలై 31 (ఆంధ్రజ్యోతి): కుందూన ది పరివాహక ప్రాంతం వెంబడి పచ్చదనం పరుచుకుంటోంది. కుందూకు భారీగా వరదనీరు వచ్చిచేరడంతో వరినాట్లు ఊపందుకున్నాయి. కుందూలో గత నెల రోజుల క్రితం నారుమళ్లు పోసుకున్న రైతన్నలు కుందూకు భారీగా వరద నీరు రావడంతో నాట్లను వేసేందుకు సిద్ధమ య్యారు. గత నాలుగు రోజుల నుంచి వరి నాట ్లతో రైతన్నలు బిజీబిజీగా ఉన్నారు. కుందూ తీర ప్రాంతంలోని కూలూరు, దద్దనాల, టంగుటూరు, తొండలదిన్నె, వెలివలి తదితర గ్రామాల్లో ఈ వరినాట్లు జోరుగా ఊపందుకున్నాయి. దాదాపు 200 ఎకరాల పైబడి వరి పంట సాగులోకి వచ్చే విధంగా ఈ వరినాట్లు రైతులు వేస్తున్నారు.

అదనంగా యూరియా అందించాలి

వరినాట్లు వేసుకున్న రైతన్నలకు గత వారంలో సచివాలయాలకు అరకొర యూరియా రావడంతో కొంత మేర ఉపయోగపడిందని, మరింత యూరి యా అవసరంఅవుతుందని రైతులు తెలిపారు. త్వరగా రైతు సేవా కేంద్రాలకు యూరియా అంది స్తే సాగు చేసుకున రైతులకు కాస్త ఉపశమనం కలుగతుందని వారు తెలిపారు. సంబంధిత వ్వవసాయాధికారులు చర్యలు చేపట్టి కుందూ నది పరివాహక ప్రాంత రైతులకు సత్వరం యూ రియా అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Jul 31 , 2025 | 11:54 PM