కశ్మీర్‌లో దాడికి పాల్పడిన వారిని శిక్షించాలి
ABN , Publish Date - Apr 28 , 2025 | 11:53 PM
‘ఉగ్రవాదం నశించాలి.. కశ్మీర్‌లో దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన (ఏపీయూడబ్ల్యుజే) జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గౌనిపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

ఏపీయూడబ్ల్యుజే ఆధ్వర్యంలో నిరసన
రాయచోటిటౌన, ఏప్రిల్28(ఆంధ్రజ్యోతి): ‘ఉగ్రవాదం నశించాలి.. కశ్మీర్‌లో దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన (ఏపీయూడబ్ల్యుజే) జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గౌనిపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రమూకల దాడిని ఖండిస్తూ సోమవారం రాత్రి ఏపీయూడబ్ల్యుజే ఆధ్వర్యంలో రాయచోటి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి నేతాజీ సర్కిల్ వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టి మానవహారం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ చేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యుజే జిల్లా అధ్యక్షుడు గౌనిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ జమ్మూకశ్మీర్‌లో ఉగ్రమూకలు హిందువులను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడడం దుర్మార్గమన్నారు. ఉగ్రదాడిని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. అనంతరం సాయి ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఉగ్రమూకల దాడి అత్యంత హేయమైన చర్య అన్నా రు. ఉగ్రదాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏపీయూడబ్ల్యుజే అన్నమయ్య జిల్లా ఎలక్ర్టానిక్ మీడియా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమేశరాజు, ఈశ్వరయ్య, భువనేశ్వర్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, మునెయ్య, నాగరాజ తదితర జర్నలిస్టులు, సాయి ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, పుర ప్రజలు పాల్గొన్నారు.