వేధిస్తున్న యూరియా కొరత
ABN , Publish Date - Aug 02 , 2025 | 12:13 AM
పోరుమా మిళ్ల వ్యవసాయ డివిజను పరిధిలోని పోరుమా మిళ్ల, కలసపాడు, కాశినాయన, బికోడూరు మండ లాల్లో యూరియా కొరత రైతన్నలను వేధిస్తోంది.

పోరుమామిళ్ల వ్యవసాయ డివిజనులో రైతుల పాట్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ ఆరోపణలు ఎమ్మార్పీకే ఇవ్వాలంటున్న అధికారులు
పోరుమామిళ్ల, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): పోరుమా మిళ్ల వ్యవసాయ డివిజను పరిధిలోని పోరుమా మిళ్ల, కలసపాడు, కాశినాయన, బికోడూరు మండ లాల్లో యూరియా కొరత రైతన్నలను వేధిస్తోంది. దీంతో రైతులు యూరియా కోసం ఎగబడుతుం డడంతో ఎరువుల దుకాణాదారులు ఎమ్మార్పీ కంటే అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయాధికారులు మాత్రం ఎమ్మార్పీకే యూరియా అమ్మకాలు జర పాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తు న్నారు. ఖరీఫ్ సీజను ప్రారంభమై చాలా వరకు పంటలు సాగులో ఉండడంతో రైతులకు యూరి యా ఎక్కువగా అవసరం కావాల్సి వచ్చింది. పోరుమామిళ్ల వ్యవసాయ డివిజనులో 4వేల హెక్టార్లు సుమారు 10వేల ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఈ పంటలకు దాదాపు 750 నుంచి వెయ్యి టన్నుల యూరియా అవసరం అవుతుంది. కాగా ప్రస్తుతం దాదాపు వంద టన్నులు మాత్రమే మంజూరయ్యాయి. అంతేకాక బి.కోడూరు, కాశినాయనలో ఎక్కువగా ఎరువుల దుకాణాలు లేకపోవడంతో మిగతా మండలాల వారు పోరుమామిళ్ల మీదే ఆధారపడి ఉన్నారు. బద్వేలు ఒంగోలు తదితర ప్రాంతాల నుంచి కూడా పోరుమామిళ్లకు ఎరువుల కొనుగో లుకు రైతులు వస్తుండడంతో యూరియాకు డి మాండ్ ఏర్పడింది. దీంతో బస్తా రూ.266.50 లకు అమ్మాల్సి ఉండగా రూ.400 డిమాండ్ చేస్తున్నార ని రైతులు ఆరోపిస్తున్నారు. పంటలు దక్కించు కోవాలంటే యూరియా అవసరమని, అందు కోసం ఎరువుల దుకాణాలకు వెళితే అధిక ధరలు డమాండ్ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఎరవుల దుకాణ యజమానులు మాత్రం తమకు కంపెనీ వారు ఎరువులతో పాటు నానో యూరి యా కూడా అంటగడుతున్నారని బస్తా లిక్విడ్ రూ.300 చెల్లించాల్సి వస్తుందని, నానో యూరి యా తీసుకుంటేనే మిగిలిన యూరియా సరఫరా చేస్తామని హోల్‌సేల్ దుకాణ యజమానులు ఆల్టిమేటం జారీ చేయడంతో తప్పనిసరి స్థితిలో యరియాతో పాటు నానో యూరియా కూడా కొనుగోలుచేయల్సి వస్తుందన్నారు. ఎమ్మార్పీ కే యూరియా అమ్మకాలు జరిగితే తాము నష్టాల బారిన పడాల్సి వస్తుందని ఇలాగైతే వ్యాపారాలు మానుకోవాల్సి వస్తుందని వ్యాపారస్తులు వాపో తున్నారు. శుక్రవారం పోరుమామిళ్లలో కొన్ని ఎరువుల దుకాణాల్లో యూరియా అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఎమ్మార్పీకే యూరియాను విక్రయించాలి
ఎమ్మార్పీకే యూరియా విక్రయించాలని లేదంటే చర్యలు తప్పవని వ్యవసాయ సహాయ సంచాల కుడు మురళీర్‌రెడ్డి హెచ్చరించారు. ఏవో చంద్ర హాసరెడ్డితో కలిసి స్థానిక వ్యవసాయ కార్యాల యంలో యూరియా ఎరువుల దుకాణా యజమా నుతో సమావేశం నిర్వహించి ఖచ్చితంగా ఎమ్మా ర్పీకే యూరియా విక్రయించాలని ఆదేశించారు. ఎరువుల దుకాణాల్లో తమ సిబ్బందిని ఉంచి అమ్మకాలు జరిపారు. రైతు సేవా కేంద్రాల్లోనే యూరియా అందేస్తే ఎమ్మార్పీకే కొనుగోలు చేయవచ్చని రైతులు పేర్కొంటున్నారు.