Share News

దళారీ వ్యవస్థను రద్దు చేయాలి

ABN , Publish Date - Aug 02 , 2025 | 11:52 PM

బొప్పాయి మధ్య దళారీ వ్యవస్థను రద్దు చేసి కిలోకు రూ.16 చెల్లించాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి డిమాండ్‌ చే శారు.

దళారీ వ్యవస్థను రద్దు చేయాలి
మాట్లాడుతున్న రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి

కిలోకు రూ.16 గిట్టుబాటు ధర చెల్లించాలి

చిట్వేలి, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి) : బొప్పాయి మధ్య దళారీ వ్యవస్థను రద్దు చేసి కిలోకు రూ.16 చెల్లించాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి డిమాండ్‌ చే శారు. శనివారం చిట్వేలి ఎంఈవో కార్యాలయం సమీపంలోని భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ పంట ప్రారంభంలో టన్ను రూ.16, 17 వేలు పలికిన ఽధర క్రమేణా తగ్గుతూ ట న్ను ధర రూ.7 వేలు చేశారన్నారు. కలెక్టర్‌ నిర్ణయించిన కిలో రూ.9 ధర పట్ల రైతులు సమ్మతించడంలేదన్నారు. కిలో రూ.16 చెల్లించాలని, దళారీ వ్యవస్థను రద్దు చేయాలని, టన్నుకు 100 కిలోల తరుగు తీయడాన్ని ఆపివేయాలని డిమాండ్‌ చేశారు. మార్క్‌ ఫండ్‌ను అమలు చేసి రైతులకు న్యాయం చేయాలన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం మార్కెట్‌ యార్డును ఏర్పాటు, హార్టికల్చర్‌ మార్కెట్‌ యార్డు అధికారులతో రైతులకు రూ.16 తగ్గకుండా ధర ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Aug 02 , 2025 | 11:52 PM