Share News

ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలి

ABN , Publish Date - Apr 27 , 2025 | 11:51 PM

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం లో అమాయకులైన పర్యాటకులను పొట్టన బెట్టుకున్న ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలని పలు సంఘాల నాయకులు పిలుపుని చ్చారు.

ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలి
పోరుమామిళ్లలో నిరసన ర్యాలీ తెలుపుతున్న ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు

పోరుమామిళ్ల, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి) : జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం లో అమాయకులైన పర్యాటకులను పొట్టన బెట్టుకున్న ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలని పలు సంఘాల నాయకులు పిలుపుని చ్చారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి ఆత్మశాంతి కోరుతూ ఆదివారం సాయంత్రం పోరుమామిళ్లలో ప్రజా సంఘాలు, ఉపాధ్యా యులు, ప్రజాప్రతినిధులు అంబేద్కర్‌ సర్కిల్‌ నుంచి మహాత్మాగాంఽధీ విగ్రహం వరకు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి, పోరుమామిళ్ల, రంగసముద్రం సర్పంచలు యనమల సుధాకర్‌, చిత్తా రవిప్రకాశరెడ్డి, డాక్టర్స్‌ అసోసియేషన అధ్యక్షుడు కళ్యాణ్‌చక్రవర్తి, టీడీపీ నాయకులు రామసుబ్బారావు తదితరులు ఉగ్రవాదం నశించాలి అంటూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ప్రజల ఐక్యత విచ్చిన్నం చేయాలని మతోన్మాదశక్తులు చెలరేగుతున్నాయిని ఉగ్రవాదంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట నాయకులు రమణా రెడ్డి, మైనార్టీ నాయకులు రాజీవ్‌బాషా, బీజేపీ నాయకుడు రమణాచారి, మానవహక్కుల సంఘం నేత పణిరావు, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు బాల రంగయ్య, సుబ్రమణ్యం, పెద్దిరెడ్డి వెంకటరెడ్డి, గంగన్న, బాలరాజు, వార ణాసి రవితో పాటు ప్రగతి శ్రీనివాసులు, పిడుగు మస్తాన పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2025 | 11:51 PM