Pulivendula: సునీల్ కుమార్ ఫిర్యాదుతో ముగ్గురిపై కేసు
ABN , Publish Date - Jun 23 , 2025 | 11:19 AM
Pulivendula: వైఎస్ వివేకా హత్యలో ఏ2 నిందితుడిగా ఉన్న సునీల్ కుమార్ యాదవ్ ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పులివెందుల పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. పవన్ కుమార్, లోకేష్ రెడ్డిలతో పాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

Kadapa Dist: వైఎస్ జగన్ (YS Jagan) బాబాయి, మాజీ మంత్రి వివేక హత్యకేసు (Veveka Murder Case)లో ఏ2 నిందితుడు (A2 Accused) సునీల్ కుమార్ ఫిర్యాదు (Sunil Kumar Complaint) కేసుకు సంబంధించి పులివెందుల పోలీసులు (Police) ముగ్గురిపై కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం సునీల్ కుమార్ తన కుటుంబంతో కలిసి కారులో వెళుతుండగా కొందరు యువకులు వెంబడించి దాడికి యత్నించారంటూ సునీల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి, విచారించిన అనంతరం పవన్ కుమార్, లోకేష్ రెడ్డిలతో పాటు మరో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పవన్ కుమార్, లోకేష్ రెడ్డిలు ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులుగా గుర్తించారు. కాగా ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులవల్ల తనకు ప్రాణహాని ఉందని ఇప్పటికే ఎస్పీ, పులివెందుల పోలీసులకు పలుమార్లు సునీల్ కుమార్ యాదవ్ ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం బెయిల్‌పై వచ్చి పులివెందులలో ఉంటున్నాడు.
అవినాష్ అనుచరుల హల్ చల్..
కాగా ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరులు శనివారం రాత్రి హల్ చల్ చేశారు. వివేకా హత్య కేసులో ఏ2 నిందితుడు సునీల్ కుమార్ యాదవ్‌ను వెంబడించారు. పులివెందులలో తన కుటుంబంతో కలిసి గుడికి వెళ్లి తిరిగి వెళ్తుండగా సునీల్ కారును అవినాశ్ అనుచరులు అనుసరించారు. దీంతో ఆందోళన చెందిన సునీల్ పులివెందుల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అవినాష్ అనుచరుల నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ డీఎస్పీకి విజ్ఞప్తి చేశాడు.
జైల్లో ఉన్నప్పుడు కూడా బెదిరించారు..
కాగా 2019 ఎన్నిలకు ముందు వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు సునీల్ యాదవ్‌ను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై వచ్చాడు. తనకు ప్రాణహాని ఉందని, తనకు భద్రత కల్పించాలని జిల్లా ఎస్పీని కోరాడు. వివేకా హత్య కేసులో ఇతర నిందితులు తనను జైల్లో బెదిరించారని తెలిపాడు. బెయిల్‌పై బయటికి వచ్చిన తర్వాత కూడా బెదిరింపులు వస్తున్నాయని సునీల్ యాదవ్ పేర్కొన్నాడు. తాను మాట్లాడే విషయాలు కొందరికి నచ్చడం లేదని, వైసీపీ పెద్దల నుంచి తనకు ప్రాణహాని ఉందని సునీల్ ఆందోళన వ్యక్తం చేశాడు. కాగా గతేడాది అక్టోబరులో అతనికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఇవి కూడా చదవండి:
జగన్‌ను నమ్మి.. నష్టపోయి.. వైసీపీ కార్యకర్త ఆత్మహత్య
శాయ్ క్రీడా సంస్థ కోచ్‌పై పోక్సో కేసు
సింగయ్య మరణాన్ని కప్పిపుచ్చేందుకు మరో డ్రామా
For More AP News and Telugu News