Share News

ప్రోత్సాహకాలతో సోలార్‌ రూఫ్‌టాప్‌ సులభతరం

ABN , Publish Date - Jun 14 , 2025 | 11:31 PM

ప్రోత్సాహకాలతో సోలార్‌ రూఫ్‌టాప్‌ సులభతరంగా ఏర్పాటు చేసుకోవచ్చని విద్యుత శాఖ సూపరింటెండెంట్‌ ఎస్‌.రమణ పేర్కొన్నారు.

ప్రోత్సాహకాలతో సోలార్‌ రూఫ్‌టాప్‌ సులభతరం
మాట్లాడుతున్న విద్యుత శాఖ సూపరింటెండెంట్‌ రమణ

విద్యుత శాఖ సూపరింటెండెంట్‌ ఎస్‌.రమణ వెల్లడి

జమ్మలమడుగు, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): ప్రోత్సాహకాలతో సోలార్‌ రూఫ్‌టాప్‌ సులభతరంగా ఏర్పాటు చేసుకోవచ్చని విద్యుత శాఖ సూపరింటెండెంట్‌ ఎస్‌.రమణ పేర్కొన్నారు. లక్ష గృహాల సోలార్‌ రూఫ్‌టాప్‌ లక్ష్యం కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ ఆదేశాల మేరకు జమ్మలమడుగు మండలంలోని మోరగుడి గ్రామంలో సోలార్‌ రూఫ్‌టాప్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎస్‌ఈ మాట్లాడుతూ బీసీ వినియోగదారులకు ఒక్కో సోలార్‌ రూఫ్‌టాప్‌కు అదనంగా రూ.20 వేలు రాయితీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందన్నారు. బ్యాంకులు సైతం రుణాలు వేగవంతంగా ఇస్తారని ఆయన తెలిపారు. ఒక్క కిలోవాట్స్‌ కెపాసిటీ సోలార్‌ రూఫ్‌టాప్‌ ఏర్పాటు చేసుకుంటే నెలకు 120 యూనిట్ల విద్యుతను అదే రెండు కిలోవాట్ల కెపాసిటీ సోలార్‌ రూఫ్‌టాప్‌ ఏర్పాటు చేసుకుంటే 240 యూనిట్ల విద్యుత ఉత్పత్తి చేస్తుందని, దీంతో గృహ వినియోగదారులు వారి విద్యుత బిల్లులను గణనీయంగా తగ్గించుకోవచ్చన్నారు. తిరిగి మిగులు విద్యుతను యూనిట్‌కు రూ.2.90 పైసలు వంతున పొందవచ్చన్నారు. అనంతరం ఇక్కడ ప్రజలకు రూఫ్‌టాప్‌పై కరపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు రమణారెడ్డి, ఏడీఈ రాజగోపాల్‌, ఏఈలు రజనీకాంత్‌రెడ్డి, ఈశ్వర్‌, మోరగుడి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 11:31 PM