Share News

విద్య ద్వారా ఉన్నత శిఖరాలు

ABN , Publish Date - Jul 30 , 2025 | 11:14 PM

విద్య ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్‌రెడ్డి అన్నారు.

విద్య ద్వారా ఉన్నత శిఖరాలు
ప్రతిభ చాటిన విద్యార్థులతో ఉపాధ్యాయులు, ముఖ్య అతిథులు

నందలూరు, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : విద్య ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చునని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం నాగిరెడ్డిపల్లె జిల్లా పరిషత పాఠశాలలో సర్పంచ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేసే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు పథకాలను అందిస్తున్నారన్నారు. నాగిరెడ్డిపల్లె సర్పంచ జంబు సూర్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నత పదవులు పొందాలన్నారు. అనంతరం పదో తగరతిలో అఖిల్‌ ప్రథమ, ఆశిక్‌ ద్వితీయ, యేసు ప్రియ తృతీయ స్థానాల్లో, అలాగే ఇంటర్మీడియట్‌ ప్రథమ మొబీనా, ద్వితీయ అక్షయ, తృతీయ గాయత్రిలకు రూ.5, 3, 2 వేల చొప్పున నగదు ప్రోత్సాహంతో పాటు మెమెంటోలను అందజేశారు. టీడీపీ నేత ధనంజయ్యనాయుడు మెమెంటోలను అందజేశారు. ప్రధానోపాధ్యాయుడు గంగనపల్లి వెంకటరమణ, ఉపాధ్యాయులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2025 | 11:14 PM